NTV Telugu Site icon

Mamata Banerjee: ప్రజావ్యతిరేకం, నాకు చీకటి మాత్రమే కనిపిస్తోంది.. బడ్జెట్‌పై మమతా..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: కేంద్ర బడ్జెట్‌ 2024-25పై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమని, ఎలాంటి దశ లేదని, ప్రజలకు వ్యతిరేకమైందని, దార్శనికత లేనిదిగా ఆమె అభివర్ణించారు. ఈ బడ్జెట్‌లో తనకు ఎలాంటి వెలుగులు కనిపించలేదని, చీకటిగా ఉందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమని, పేదలకు వ్యతిరేకమని, రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదిగా ఆమె ఆరోపించారు. ఇది సామాన్యుల కోసం కాదని, ఒక పార్టీని సంతృప్తి పరిచేందుకు ఉద్దేశించిన బడ్జెట్‌గా ఆమె ఆరోపించారు.

Read Also: Cigarette Prices: బడ్జెట్‌లో పొగాకుపై పెరగని పన్ను.. సిగరేట్ రేట్లు యథాతథం..

బీజేపీ ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు వాటిని నెరవేర్చలేదని ఆమె విమర్శించారు. ఎన్నికల సమమయంలో పెద్ద ఎత్తు హామీలు ఇస్తుంటారు, కానీ ఓట్లు పొందిన తర్వాత డార్జిలింగ్, కాలింపాంగ్‌లను మరిచిపోతారని చెప్పారు. డార్జిలింగ్ కొండల్లోని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సిక్కింకి అభివృద్ధికి సహకరించండి కానీ డార్జిలింగ్‌ని పట్టించుకోకపోవడం మాత్రం సరైంది కాదని ఆమె అన్నారు.

మరోవైపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రభుత్వం తమ కుర్చీని కాపాడుకునేందుకు ఈ బడ్జెట్ పెట్టిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలనే కాపీ పేస్ట్ చేసి బడ్జెట్‌లో పెట్టారని చెప్పింది. కేవలం కొందరిని మాత్రమే సంతృప్తి పరిచేందుకు ఈ బడ్జెట్ ఉద్దేశించబడిందని, సామాన్య ప్రజలకు దీంతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పింది. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిందని, దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని బీజేపీ చెబుతోంది.