Murshidabad Violence: వలస కూలీ హత్యతో పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు బెల్దంగాలో జాతీయ రహదారి 12ను దిగ్భందించడంతో మళ్లీ అశాంతి నెలకొంది. బెల్దంగాలోని బరువా మోర్ వద్ద వందలాది మంది స్థానికులు రహదారిపై చేరి, ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. అల్లరి మూకలు ఒక రైల్వే గేటును ధ్వంసం చేశారు. తూర్పు రైల్వేలోని సీల్దా-లాల్‌గోలా రైల్వే సెక్షన్‌లో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
Read Also: Flipkart Republic Day Sale: మీ ఇంట్లోనే థియేటర్.. 50 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు!
రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టడానికి, దిగ్భందాన్ని ఎత్తివేయడానికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. లాఠీఛార్జ్ చేసి రోడ్లను క్లియర్ చేయాల్సి వచ్చిందని ముర్షిదాబాద్ ఎస్పీ కుమార్ సన్నీ రాజ్ తెలిపారు. గత రెండు రోజులుగా జరిగిన హింసలో 15 నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల వలస కూలీ అలావుద్దీన్ షేక్ జార్ఖండ్ రాష్ట్రంలో హత్యకు గురయ్యాడు. దీంతో ముర్షిదాబాద్‌లో హింస చెలరేగింది. అతడిని కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ పరిణామాల గురించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో వలస కార్మికుల్ని టార్గెట్ చేస్తున్నారని, మైనారిటీల కోపం సమర్థనీయమే అని అన్నారు. అయితే, తాను ఇలాంటి హింసను సమర్థించనని, కానీ అన్నీ తన చేతుల్లో లేవని అన్నారు.