Allahabad High Court: 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు (జూన్ 4న) విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు మీకు ఇస్తుంది.. కానీ, ఈ స్వేచ్ఛ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది అని గుర్తి చేసింది. అయితే, భారత సైన్యాన్ని కించపరిచేలా ప్రకటనలు చేసే స్వేచ్ఛ ఎవరు ఇచ్చారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
Read Also: Huawei Pura 80 Series: మాస్టర్ ప్లాన్ వేసిన హువావే.. ఒకేసారి నాలుగు మొబైల్స్ లాంచ్..!?
అయితే, భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022లో రాజస్థాన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించి, 20 మంది భారతీయ సైనికులను చంపి, మన సైనికులను కొట్టిందని ఆరోపించారు. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. వారు ఒక్క ప్రశ్నకు కూడా జావాబు ఇవ్వరని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. ట్రయల్ కోర్టు అతనికి సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి.. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరారు.
Read Also: CM Chandrababu: మంత్రులతో కీలక అంశాలపై చర్చ.. దూకుడు పెంచాలని సీఎం ఆదేశాలు
అలాగే, రాహుల్ గాంధీ తన పిటిషన్‌లో ఫిర్యాదుదారుడు భారత సైన్యానికి చెందిన అధికారి కాదు.. దీని వల్ల అతడు బాధిత వ్యక్తి కాదని వాదించారు. ఇక, రాహుల్ వాదనను తోసిపుచ్చిన కోర్టు, సెక్షన్ 199(1) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC) ప్రకారం.. నేరానికి ప్రత్యక్ష బాధితుడు కాకుండా వేరే వ్యక్తి కూడా ఆ నేరం వల్ల ప్రభావితమైతే వారిని బాధిత వ్యక్తిగా పరిగణించవచ్చని వెల్లడించింది. ఈ కేసులో, ఉదయ్ శంకర్ శ్రీవాస్త కల్నల్‌తో సమానమైన హోదా కలిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు రిటైర్డ్ డైరెక్టర్ కాబట్టి.. ఈ నేరం వల్ల ‘బాధపడిన’ వ్యక్తి అని అలహాబాద్ హైకోర్టు తెలిపింది.
