NTV Telugu Site icon

అయోధ్య, వేలాంక‌ని, అజ్మీర్‌కి ఉచిత యాత్ర.. కేజ్రీవాల్ హామీ..!

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్‌ చేస్తున్నారు.. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రచారం చేస్తున్నారు. ఒకే వర్గం ఓటర్లను ఆర్షించడం కాదు.. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు గుప్పిస్తున్నారు..

Read Also: ధాన్యం సేకరణపై పటిష్ట విధానం.. సీఎం ఆదేశాలు

గోవాలో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే హిందువుల‌కు అయోధ్య, క్రైస్తవుల‌కు వేలాంక‌ని, ముస్లింల‌కు అజ్మీర్‌కు ఉచిత యాత్రా సౌక‌ర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు కేజ్రీవాల్‌.. అంతేకాదు షిర్డీ సాయిబాబాను ఆరాధించే వారి కోసం ఉచిత షిర్డీ యాత్ర అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఇవాళ గోవాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కేజ్రీవాల్.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని.. వారిలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. మ‌రో పార్టీపై చ‌ర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు.