Aadhaar Update: ఆధార్ కార్డు ఉన్నవారు తమ లేటెస్ట్ వివరాలను ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛాన్స్ ఇచ్చింది. అందుకు నిర్దేశిత గడువులోపు ఆన్‌లైన్లో ఉచితంగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది. ఇటీవలే అడ్రస్ మారిన వారు కచ్చితంగా తమ ఆధార్ కార్డులో పూర్తి అడ్రస్ డీటెయిల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తమ ఆధార్ కార్డు వివరాలను అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ వెల్లడించింది. బెటర్ సర్వీస్ డెలివరీ, కచ్చితమైన ఆధార్ ఆధారిత అథెంటికేషన్ కోసం తమ లేటెస్ట్ డీటెయిల్స్ సవరించుకోవాల్సి అవసరం ఉంది.
Read Also: Date Extended: ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
ఇప్పుడు myAadhaar పోర్టల్‌లో ఫ్రీగా ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆధార్ అప్‌డేట్ ద్వారా ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, అడ్రస్, జెండర్ లాంటి వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు అన్నమాట. అయితే, ఉచిత ఆధార్ అప్‌డేట్ కోసం ముందు జూన్ 14 లాస్ట్ డేట్ అని UIDAI ప్రకటించింది. కానీ, ఆ గడువును మరో 6 నెలలు పొడిగిస్తూ మరో అవకాశం కల్పించింది.
Read Also: YSRCP: సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ
ఇక, ఆన్ లైన్ లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి నేటి (డిసెంబర్ 14) వరకు గడువు ఇచ్చింది. ఈ రోజు మిస్ అయితే, ఆ తర్వాత నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఫిక్స్ చేసిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఉచిత ఆధార్ అప్ డేట్ కోసం ముందుగా https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి వెళ్లాలి.. ఇందులో మొదట మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి లాగిన్ కావాలి.. ఆ తర్వాత Online Update Services పైన నొక్కాలి.. తద్వారా Update Aadhaar Online పైన క్లిక్ చేసి Proceed to Update Aadhaar పైన క్లిక్ చేసి పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని.. మీ డీటెయిల్స్ నమోదు చేసుకోవాలి. డబ్బులు అవసరం లేకుండా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. అప్పుడు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు రానుంది.