France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
- ఫ్రాన్స్ అలర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర..
- 9 దేశాల్లోని 101 సంస్థల నెట్‌వర్క్‌పై ఆరోపణలు..
- సంచలనంగా ఫాక్స్ న్యూస్ దర్యాప్తు నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ జరుగుతున్న నిరసనల మధ్య సంబంధాలు ఉన్నాయని ఫాక్స్ న్యూస్ సంచలన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. 9 దేశాల్లో 101 సంస్థలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, ఇవన్నీ నిరసనలకు మద్దతు ఇవ్వడం, వాటిని నిర్వహించడం, ప్రచారం చేయడంలో భాగస్వాములు అవుతున్నాయకని నివేదిక ఆరోపించింది. సీనియర్ ఎడిటర్ అస్రా నోమానీ రూపొందించిన ‘Global Chaos Inc Grows to 101 Groups’ అనే నివేదికలో ఈ నెట్‌వర్క్‌ను “రెడ్-గ్రీన్ ప్రొటెస్ట్ ఎకోసిస్టమ్”గా అభివర్ణించారు. ఇందులో కమ్యూనిస్టు, ఇస్లామిస్ట్ సంస్థలుగా నివేదిక పేర్కొన్న కొన్ని సమూహాల మధ్య సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. కార్మిక, విద్యార్థి సంఘాలు, ప్రచార నెట్వర్క్, మీడియా సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయని నివేదిక చెప్పింది.
ఈ నెట్వర్క్ కేవలం ఫ్రాన్స్‌కే పరిమితం కాలేదని, అమెరికా, యూకే, గ్రీస్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలకు కూడా విస్తరించిందని నివేదిక తెలిపింది. ఆయా దేశాల్లోని సంస్థలు మద్దతుదారుల్ని సమీకరిస్తూ నిరసనలకు పిలుపునిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా ఈ ప్రచారాన్ని తీవ్రం చేస్తున్నట్లు ఆరోపించింది.
Also Read
- Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
- CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
- Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
- Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే ఇండియన్ అలయన్స్ పారిస్ ప్రస్తావన..
ఈ నివేదికలో ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ‘‘ఇండియన్ అలయన్స్ పారిస్(IAP) అనే సంస్థను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫ్రాన్స్, భారత్‌లో జరుగుతున్న ఈ నిరసనలకు సంబంధించిన సందేశాలను అనుసంధానించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని నివేదిక పేర్కొంది. న్యూయార్క్‌లోని పీపుల్స్ ఫోరమ్‌తో కూడా ఈ సంస్థ భాగస్వామ్యం ఉందని తెలిపింది. అంతర్జాతీయ సంస్థ ప్రొగ్రెసివ్ ఇంటర్నేషనల్(PI) అక్టోబర్ 16న తన వెబ్సైట్లో ప్రచురించిన బ్రీఫింగ్లో ఫ్రాన్స్, స్పెయిన్, భారత్, అల్బేనియాలో జరుగుతున్న నిరసనల్ని ఒకే సందర్భంలో ప్రస్తావించినట్లు నివేదిక పేర్కొంది.
విదేశీ నిధులు.. నెవిల్ రాయ్ సింగమ్ ప్రస్తావన..
యూరప్‌లో జరుగుతున్న నిరసనలకు కమ్యూనిస్టు భావజాలంతో సంబంధం ఉన్న సంస్థలు మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తున్నాయని అస్రా నోమానీ నివేదిక ఆరోపించింది. ఇందుల్లో బ్రేక్‌త్రూ న్యూస్, కోడ్పింక్, పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ వంటి సంస్థల్ని ప్రస్తావించింది. చైనాలో నివసిస్తున్న అమెరికాలో జన్మించిన టెక్నాలజీ వ్యాపారవేత్త నెవిల్ రాయ్ సింగమ్ ఈ సంస్థలకు నిధులు లేదా మద్దతు అందిస్తున్నాడని నివేదిక పేర్కొంది. సింగమ్ భార్య కోడ్ పింగ్ వ్యవస్థాపకురాలు జోడీ ఇవాన్స్ అక్టోబర్ 14 ప్రచురితమైన బ్రేక్‌త్రూ న్యూస్ ఇంటర్వ్యూలో ఫ్రాన్స్, స్పెయిన్, భారత్‌లో జరుగుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొనాలని వ్యాఖ్యానించినట్లు కథనం తెలిపింది.
పారిస్‌లోని ఐ IAP కార్యదర్శి, భారత సంతతికి చెందిన జర్నలిస్టు జాయ్ బెనర్జీకి ఫ్రెంచ్ కార్మిక సంఘం CGTతో గతంలో సంబంధాలున్నాయని, ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీతోనూ అనుబంధం ఉందని నివేదిక ఆరోపించింది.
తాజావార్తలు
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!