Site icon NTV Telugu

Bharatiya Janata Party: నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి

Bjp

Bjp

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్‌ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. శతృఘ్నసిన్హా (తృణమూల్ కాంగ్రెస్), బాబుల్‌ సుప్రియో (తృణమూల్ కాంగ్రెస్) విజయం సాధించారు. అస్సనోల్‌ లోక్‌సభను గతంలో బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆ స్థానం అధికార పార్టీ టీఎంసీ వశమైంది.

మరోవైపు బీహార్‌లోని బబోచాహన్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ ఘన విజయం సాధించింది. ఆర్జేడీ అభ్యర్థి అమర్‌ కుమార్‌ పాశ్వాన్‌ గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌ ఖాయిరాగఢ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి యశోధ నీలాంబర్‌ వర్మ గెలుపొందారు. అటు మహారాష్ట్ర కోల్హాపూర్‌(నార్త్‌) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జాదవ్‌ జైశ్రీ చంద్రకాంత్‌ విజయం సాధించారు.

Prashant Kishor: కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న పీకే..? సోనియా, రాహుల్‌తో భేటీ..

Exit mobile version