NTV Telugu Site icon

Maharashtra: ఆగని మరాఠా ఉద్యమం.. మరో నలుగురు ఆత్మహత్య

Untitled 4

Untitled 4

Maharashtra: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమమం రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటూ ఉంది. ఇప్పటికే ఉద్యమం లో పాల్గొన్న చాలామంది ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను కోల్పోయారు. కాగా ఈ రోజు మరో నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాలపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మరాఠా కమ్యూనిటీకి OBC రిజర్వేషన్లు ఇవ్వాలంటూ జరుగుతున్న ఉద్యమానికి.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరాంగేకి మద్దతు తెలుపుతూ 26 ఏళ్ల యువకుడు రంజిత్ మంజరే విషం తాగాడు. ఈ నేపథ్యంలో రంజిత్ మంజరేకి మద్దతుగా దీపక్ పాటిల్, యోగేష్ మంజ్రే, ప్రశాంత్ మంజ్రేలు ఆస్పత్రి ఆవరణ లోనే విషపూరితమైన మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. నలుగురూ దేవ్‌గావ్‌ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read also:Chiyaan Vikram: తంగలాన్ టీజర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ… విక్రమ్ మరో నేషనల్ అవార్డ్ ఇచ్చేయొచ్చు

కాగా మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని 32 సంవత్సరాల క్రితం మొదటి సారిగా మొదలైన ఈ ఉద్యమం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే గత కొంత కాలంగా సద్దుమణిగి ఉన్న ఉద్యమం మరోసారి మనోజ్ జరాంగే నేతృత్వంలో ఊపిరి పోసుకుంది. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరాంగే నిరాహార దీక్షకు పూనుకున్నాడు. ఆయనకు మద్దతు ఇస్తూ చాలామంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇలా ఉండగా గత వారం రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న మనోజ్ జరాంగే నిన్న సోమవారం అనారోగ్యానికి గురైయ్యారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన ఉద్యమకారులు మహారాష్ట్ర సీఎం మనోజ్ గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. రాజకీయ నాయకుల ఇళ్లకు, కార్యాలయాలకు, దుకాణాలకు నిప్పు అంటిస్తూ మహారాష్ట్రలో హింసాత్మక వాతావరణాన్ని సృస్తిస్తున్నారు.