Road Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి లక్నోలోని దేవా రోడ్డులో కిరణ్, కుందన్ యాదవ్, బంటీ యాదద్, శోబిత్ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఇన్నోవా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో.. ఎదురుగా ఉన్న భారీ ట్రక్కును వ్యాన్ ఢీకొట్టడంతో అందులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: CM Chandrababu: నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ!
ఇక, ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 11 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే, మరణించిన నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారి పంకజ్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. ప్రమాదంపై జిల్లా అధికార యంత్రాంగానికి సీఎం కీలక ఆదేశాలకు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం యోగి సూచించారు.