NTV Telugu Site icon

NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్‌‌లపై కేంద్రమంత్రి..

Minister

Minister

NEET: నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ పరీక్షల రద్దుపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన పరీక్షలకు 30 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తర్వాత నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అంశంపై ఈ రోజు నిరసనలు తెలిపింది. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ యూత్ వింగ్ ఆందోళన నిర్వహించిన తర్వాత కేంద్రమంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థుల ప్రయోజనాలకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాను హామీ ఇస్తున్నాను. పారదర్శకతలో రాజీపడము. నీట్ పరీక్షకు సంబంధించినంతవరకు మేము బీహార్ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నాము. ప్రాథమిక సమచారం ప్రకారం పాట్నా పోలీసులు మాకు వివరణాత్మక నివేదిక పంపుతారు. అవకతవకలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.’’ అని అన్నారు.

Read Also: Tata Nexon CNG Launch: లాంచింగ్‌కి సిద్ధమవుతున్న టాటా నెక్సాన్ CNG.. బ్రెజ్జాతో పోటీ..

ఖచ్చితమైన సాక్ష్యాలు లభించిన తర్వాత, దోషుల్ని ఎవ్వర్ని వదిలిపెట్టబోమని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దీని వెనక ఎన్‌టీఏలో సీనియర్ అధికారులు ఉన్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రాధాన్యత విద్యార్థుల భవిష్యత్తు అని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ NTA యొక్క నిర్మాణం, దాని పనితీరు, పరీక్ష ప్రక్రియ, పారదర్శకత మరియు డేటా మరియు భద్రతా ప్రోటోకాల్‌ను మెరుగుపరచడంపై సిఫార్సులను ఇస్తుందని చెప్పారు.

పబ్లిక్ పరీక్షల్లో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని, ఇలాంటి అంశాలపై పుకార్లు పుట్టించవద్దని, రాజకీయం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.లక్షలాది మంది విద్యార్థులు, వారిలో చాలా మంది పేదవారు లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన అభ్యర్థులు మంచి మార్కులు సాధించారని, మంచి ర్యాంకులు పొందారని చెప్పారు. వారి కెరీర్‌ని తాకట్టలు పెట్టలేమని, ఒక చోట జరిగిన అవకతవకలతో మొత్తం విద్యార్థుల కెరీర్‌ని పణంగా పెట్టలేమని చెప్పారు.