హెచ్-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. దీంతో చాలా మంది హెచ్-1బీ వీసా దొరకక నానా యాతన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
తాజాగా మాజీ వీసా అధికారి సైమన్ హాంకిన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసా జారీలో ఏదో తప్పు జరుగుతోందని వ్యాఖ్యానించారు. సైమన్ హాంకిన్సన్.. భారతదేశంలో కాన్సులర్ అధికారిగా పని చేశారు. తాజాగా ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘నేను 25 సంవత్సరాల క్రితం నా మొదటి H-1B వీసా ఇంటర్వ్యూ చేశాను. కానీ అది అమెరికన్లను మొదటి స్థానంలో ఉంచడంలో విఫలమైంది.’’ అని రాసుకొచ్చారు.
ఫాక్స్ న్యూస్ వ్యాసంలో సైమన్ హాంకిన్సన్ అనేక విషయాలు వెల్లడించారు. హెచ్-1బీ వీసా కార్యక్రమంలో ఏదో తప్పు జరుగుతోందని మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నట్లు పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలపై ఒక నివేదికను సమర్పించినట్లు తెలిపారు. తన నివేదిక ప్రకారం… అమెరికన్లను మొదటి స్థానంలో ఉంచడం తన ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. తన కెరీర్‌లో ఇంటర్వ్యూలు చేసిన దరఖాస్తుదారులలో కొంత మంది అసాధారమైన ప్రతిభావంతులు ఉన్నప్పటికీ.. వారిలో ఎక్కువ మంది సగటు కళాశాల గ్రాడ్యుయేట్ ఉద్యోగులే అని అన్నారు. నిజానికి చాలా మంది H-1Bపై వచ్చే ఉద్యోగాలకు సగటు జీతాల కంటే తక్కువ జీతమే లభిస్తుందని చెప్పారు. వారు నిజంగా అసాధారణమైన వారైతే యజమానులు వారికి అమెరికన్ల కంటే తక్కువ జీతాలు ఎందుకు చెల్లిస్తారు? అని వ్యాఖ్యానించారు.
‘‘ఒక చైనీస్ లేదా భారతీయ విద్యార్థిని అమెరికన్ విద్యార్థితో పోల్చడం అన్యాయమని.. ఎందుకంటే ఒక చైనీస్ లేదా భారతీయ విద్యార్థి వారి దేశాలలోని ఉచిత లేదా చవకైన పాఠశాలలకు వెళ్లి తక్కువ అప్పుతో BA, MA లేదా PhD కూడా పొందుతారు. కానీ అమెరికాలో విద్యార్థులు అదే స్థాయికి చేరుకోవడానికి వేల డాలర్లు అప్పు చేస్తున్నారు. అమెరికన్లు.. H-1B పోటీదారులు పొందగలిగే తక్కువ జీతాలతో ఉద్యోగాలు తీసుకోలేరు. అయినా అమెరికా కంపెనీలకు పెద్దగా స్పెషాలిటీ వర్కర్లు అవసరం లేదు’’ అని హాంకిన్సన్ వ్యాసంలో రాసుకొచ్చారు.
Here’s a nutshell version of my H-1B report and the panel event on 19 Nov. https://t.co/AHPNL5ziSo
— Simon Hankinson (@WatchfulWaiter1) December 3, 2025
