Site icon NTV Telugu

Delhi: ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌గా రామసుబ్రమణియన్‌ నియామకం

Ramasubramanian

Ramasubramanian

జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగిసింది. అప్పటి నుంచి చై‌ర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. మిశ్రా పదవీ విరమణ తర్వాత తాత్కాలిక చైర్‌పర్సన్‌గా విజయ భారతి సయానీ నియమితులయ్యారు. తాజాగా పూర్తి ఛైర్మన్‌గా రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. ఈ పదవికి మాజీ ప్రధాన న్యాయమూర్తులు లేదా సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జిలను నియమిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో చైర్‌పర్సన్‌గా ఉంటారు. గతంలో మాజీ సీజేఐలు హెచ్‌ఎల్ దత్తు కేజీ బాలకృష్ణన్ కూడా హెచ్‌ఆర్సీ పదవిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Bengaluru: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.11.8 కోట్లు మాయం

తనను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ పదవికి పరిశీలిస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శుక్రవారం ఖండించారు. డిసెంబర్ 18న తదుపరి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ ​​పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాజ్యసభ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలుగా సమావేశానికి హాజరయ్యారు.

వి.రామసుబ్రమణియన్‌ భారత్‌కు చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రామసుబ్రమణ్యన్‌ తమిళనాడు రాష్ట్రం చైన్నైలో జన్మించారు. మద్రాస్‌ లా కాలేజీలో ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1983 ఫిబ్రవరి 16లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ ప్రారంభించి 23 సంవత్సరాలపాటు చెన్నై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశారు. 31 జూలై 2006లో మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదిగా నియమితులై 2016 ఏప్రిల్ 26 వరకు పనిచేశారు. 2016 ఏప్రిల్ 27 నుంచి 2019 జూన్ 21 వరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా, 2019 జూన్ 22 నుంచి 2019 సెప్టెంబరు 22 వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 2023 జూన్‌ 30వ తేదీ వరకు కొనసాగారు.

ఇది కూడా చదవండి: Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో అగ్నిప్రమాదం

Exit mobile version