ఢిల్లీ బాబా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2016లో చదివిన ఓ మాజీ విద్యార్థి సంచలన విషయాలు బయటపెట్టాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. స్వామిజీ చైతన్యానందకు అమ్మాయి నచ్చితే చాలు అదనపు సౌకర్యాలతో ప్రత్యేక గది లభించేదని తెలిపాడు. అంతేకాకుండా బ్లాక్‌బెర్రీ, ఆపిల్ వంటి ఖరీదైన ఫోన్‌లు ఇచ్చేవాడని పేర్కొన్నాడు. అనంతరం ఆ ఫోన్లను యాక్సెస్ చేసే సౌకర్యం పొందేవాడని చెప్పాడు. చాట్‌లు, సందేశాలు డిలీట్ చేయగలిగే ఏర్పాట్లు కూడా చేసుకున్నాడని పేర్కొన్నాడు. ఆ ఫోన్లతో కుటుంబ సభ్యులతో గానీ.. బంధువులతో గానీ మాట్లాడవద్దని చెప్పేవాడని తెలిపాడు.
ఇది కూడా చదవండి: India-China: భారతీయులకు గుడ్‌న్యూస్.. భారత్-చైనా విమాన సర్వీసులు ప్రారంభం ఎప్పుడంటే..!
బాబాకు దుబాయ్ షేక్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఒక అమ్మాయిని దుబాయ్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. దుబాయ్ షేక్‌కి సెక్స్ పార్టనర్ అవసరం అని చెప్పి.. ఎవరైనా ఉన్నారా? అడిగేవాడని తెలిపాడు. దుబాయ్ షేక్‌లతో ఎప్పుడూ బాబా మాట్లాడుతూ ఉండేవాడని పేర్కొన్నాడు. దుబాయ్, యూఏఈల గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేవాడని.. సెక్స్ రాకెట్ గురించి మాత్రం తనకు తెలియదని తెలిపాడు.
ఇది కూడా చదవండి: UP: వరకట్నం హత్య కేసులో షాకింగ్ ఘటన.. రెండేళ్ల తర్వాత బిగ్ ట్విస్ట్
బాబాను తల్లిదండ్రులు గ్రుడ్డిగా నమ్మి శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో చేర్పిస్తున్నారని.. మంచి విద్య లభిస్తుందని భావించి ఇలా చేశారని తెలిపాడు. కానీ తల్లిదండ్రులకు బాబా అసలు రూపం మాత్రం తెలియక మోసపోయారన్నారు. 2016లోనే చాలా ఘోరాలు జరిగాయని.. తాజాగా ఆ పరిస్థితులు తీవ్రం అయ్యాయని తెలిపాడు. ఇనిస్టిట్యూట్‌లో పని చేసే సిబ్బంది. వార్డెన్లే దీనింతటికి కారణం అని చెప్పాడు. సిబ్బందే.. అమ్మాయిలను బాబాకు పరిచయం చేసేవారని.. అనంతరం వారిని ముగ్గులోకి లాగి బాబా అఘాయిత్యాలకు పాల్పడేవాడని వివరించాడు.
17 మంది విద్యార్థినులు తమపై బాబా లైంగిక దాడి చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇనిస్టిట్యూట్‌లో జరుగుతున్న ఘోరాలు ఓ లేఖ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిందితుడి కోసం గాలించగా ఆదివారం అరెస్ట్ చేశారు. సోదాల్లో సెక్స్ సీడీలు, అశ్లీల చిత్రాలు దొరికాయి. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.
