NTV Telugu Site icon

Manmohan Singh Passes Away Live Updates: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కన్నుమూత.. పలువురు సంతాపం, లైవ్‌ అప్‌డేట్స్!

Manhon

Manhon

Manmohan Singh Passes Away Live Updates: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక, మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మీ కోసం ఎన్టీవీ లైవ్ అప్ డేట్స్..

  • 27 Dec 2024 07:00 PM (IST)

    మన్మోహన్ సింగ్‌కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం తెలిపింది. భారతదేశ వేగవంతమైన ఆర్థిక వృద్ధికి పునాది వేశారని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది.

  • 27 Dec 2024 06:04 PM (IST)

    బహుముఖ వ్యక్తిత్వం ఆయన సొంతం: మాజీ సీఎం అశోక్ గెహ్లాట్.

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ సంతాపం వ్యక్తం చేశారు. అతని వ్యక్తిత్వం అందరూ వినే విధంగా ఉండేదని, బహుముఖ వ్యక్తిత్వం ఆయన సొంతమని అన్నారు. తన జీవితాన్ని సరళంగా గడిపారని, అతని మరణం దేశానికి చాలా విచారకమరని చెప్పారు.

  • 27 Dec 2024 04:51 PM (IST)

    దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశారు: దేవేంద్ర ఫడ్నవీస్.

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం మనందరిలో చాలా బాధను మిగిల్చిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. దేశ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్‌గా తన బాధ్యతల్ని నిర్వర్తించేందుకు ప్రయత్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు.

  • 27 Dec 2024 04:13 PM (IST)

    దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది-మెహబూబా ముఫ్తీ

    మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం. దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది.

  • 27 Dec 2024 04:00 PM (IST)

    ఫ్రాన్స్‌కి నిజమైన ఫ్రెండ్, గొప్ప వ్యక్తిని కోల్పోయింది..

    భారత్ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. మన్మోహన్ సింగ్ ఫ్రాన్స్‌ నిజమైన స్నేహితుడిని కోల్పోయింది. అతను తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు. మా ఆలోచనలు ఆయన కుటుంబ, భారతదేశ ప్రజలతో ఉన్నాయి: ఇమ్మాన్యుయేల్ మక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు.

  • 27 Dec 2024 03:53 PM (IST)

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి ఢిల్లీ బీజేపీ సంతాపం..

    మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన ఢిల్లీ బీజేపీ నేతలు..

  • 27 Dec 2024 03:51 PM (IST)

    తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాళి..

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాళులు అర్పించారు.

  • 27 Dec 2024 03:50 PM (IST)

    మన్మోహన్ సింగ్‌కి సీఎం చంద్రబాబు నివాళి.

    మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కి అంతిమ నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

  • 27 Dec 2024 02:26 PM (IST)

    నేటి సాయంత్రం సీడబ్ల్యూసీ సమావేశం..

    ఢిల్లీలో ఈరోజు సాయంత్రం 5: 30 గంటలకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపనున్న సీడబ్ల్యూసీ..

  • 27 Dec 2024 02:17 PM (IST)

    మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించిన కేంద్ర కేబినెట్.. ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్ర కేబినెట్..

  • 27 Dec 2024 02:05 PM (IST)

    నా జీవితంలో ముఖ్యమైన గురువుని కోల్పోయా: రాహుల్ గాంధీ

    మన్మోహన్ సింగ్ ప్రధానిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ గురువును కోల్పోయా: రాహుల్ గాంధీ

  • 27 Dec 2024 02:04 PM (IST)

    మన్మోహన్ సింగ్ జీవితంపై విడుదలైన సినిమా..

    భారత ప్రధానిగా పదేళ్ల పాటు సేవలందించిన మన్మోహన్ సింగ్ జీవితంపై ఓ సినిమా రూపొందించారు.. మన్మోహన్ సన్నిహితుడు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో ఈ మూవీ.. ఇందులో మన్మోహన్ పాత్రను బాలీవుడ్ హీరో అనుపమ్ ఖేర్ పోషించగా.. సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా.. 2019 జనవరి 11న విడుదలైన ఈ చిత్రంలోని పలు డైలాగ్లపై అప్పట్లో సర్వత్రా చర్చ..

  • 27 Dec 2024 01:56 PM (IST)

    మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన ఫరూక్ అబ్దుల్లా

    మన్మోహన్ సింగ్ మృతికి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా సంతాపం తెలిపారు.. ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా పని చేశాను అని గుర్తు చేసుకున్నారు.. అతని కాలంలోనే పునరుద్ధరణ శక్తికి గుర్తింపు వచ్చిందని వెల్లడి.. ఆయన చేసిన కృషిని ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాం.. కాశ్మీర్‌లో మన కాశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించేందుకు ఎవరైనా చర్యలు తీసుకున్నారంటే అది కేవలం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మాత్రమే: మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా

  • 27 Dec 2024 01:21 PM (IST)

    రేపు ఢిల్లీలోని శక్తి స్థల్‌లో మన్మోహన్ అంత్యక్రియలు

    రేపు ఢిల్లీలోని శక్తి స్థల్‌లో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి..

  • 27 Dec 2024 01:09 PM (IST)

    మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సంజయ్ సింగ్ డిమాండ్

    మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థకు చేసిన సేవలను పేర్కొంటూ భారతరత్న ఇవ్వాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్..

  • 27 Dec 2024 01:06 PM (IST)

    మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎన్నో జీవితాలను మార్చేశాయి..

    మన్మోహన్‌ సింగ్‌ మృతికి భారతదేశం మొత్తం సంతాపం తెలియజేస్తుంది.. ఆయన నాయకత్వం దేశ గమనాన్నే మార్చివేసింది.. ఆర్థికమంత్రిగా ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశ పెట్టిన ఘనత మన్మోహన్‌ కు దక్కుతుంది.. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఆర్టీఏ చట్టం, విద్యాహక్కు చట్టం లాంటి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు.. ఇవి ఎంతో మంది జీవితాలను మార్చేశాయి.. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది.. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • 27 Dec 2024 01:02 PM (IST)

    దేశంలోని గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్ సింగ్ ఒకరు..

    దేశంలోని గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్ సింగ్ ఒకరు.. వరుసగా రెండుసార్లు భారత ప్రధానిగా ఉండి చరిత్రలో నిలిచిపోయే మార్పులు చేశారు.. అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్‌ సభ్యుడిగా, పర్యటక శాఖ సహాయమంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

  • 27 Dec 2024 01:00 PM (IST)

    ముస్లింల అభ్యున్నతికి కృషి చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్: ఎంఐఎం చీఫ్

    అణగారిన వర్గాలు, ముఖ్యంగా ముస్లింల అభ్యున్నతికి కృషి చేసిన తొలి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని నష్టం..

  • 27 Dec 2024 12:34 PM (IST)

    మనోహ్మన్ సింగ్ మృతి తీరని లోటు..

    మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ మృతి తీరని లోటు.. ఈయన దేశ ప్రధానిగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా ఎన్నో కీలక పదవుల్లో సేవలు అందించారు.. సామాజిక న్యాయంపై లోతైన నిబద్ధత కలిగిన పాలనను మన్మోహన్ సింగ్ అందించారు: కమల్ హాసన్

  • 27 Dec 2024 12:30 PM (IST)

    మన్మోహన్‌ పార్థివ దేహానికి ఉప రాష్ట్రపతి నివాళులు..

    మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ పార్థివదేహానికి ఘన నివాళులర్పించిన ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌.. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన ఉప రాష్ట్రపతి.

  • 27 Dec 2024 12:27 PM (IST)

    అఫ్గనిస్థాన్‌కు మన్మోహన్ సింగ్ మంచి స్నేహితుడు..

    భారతదేశం తన ప్రియమైన నేతల్లో ఒకరిని కోల్పోయింది. అఫ్గనిస్థాన్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంచి స్నేహితుడు.. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.. అతడి ఆత్మకు శాంతి లభిస్తుంది: అఫ్గన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్

  • 27 Dec 2024 12:25 PM (IST)

    భారత్‌- రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర..

    భారత్‌- రష్యా దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సహకారం ఎనలేనిది.. ఆర్థికవేత్తగా అతని నైపుణ్యం, భారతదేశ పురోగతికి అతని నిబద్ధత కనిపిస్తుంది: రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌

  • 27 Dec 2024 12:23 PM (IST)

    మన్మోహన్ ఇక లేరంటే చాలా బాధగా ఉంది: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్

    భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరంటే చాలా బాధగా ఉంది.. ఆయనతో కలిసి పని చేయడం నాకు ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేది.. మాల్దీవులు ఓ మంచి స్నేహితుడిని కోల్పోయింది: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్

  • 27 Dec 2024 12:17 PM (IST)

    మన్మోహన్‌ సింగ్‌ గొప్ప రాజనీతిజ్ఞుడు: రజనీకాంత్

    మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ గొప్ప ఆర్థిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు అని కొనియాడిన సినీ నటుడు రజనీకాంత్‌

  • 27 Dec 2024 12:05 PM (IST)

    మన్మోహన్‌ సింగ్‌ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్రనేతల నివాళి..

    మన్మోహన్‌ సింగ్‌ భౌతికకాయం వద్ద కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియా, ప్రియాంక నివాళులర్పించారు.

  • 27 Dec 2024 11:43 AM (IST)

    మన్మోహన్‌ సింగ్ లేని తీరనిది: మాజీ రాష్ట్రపతి కోవింద్‌

    మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ లేని లోటు పూడ్చలేనిది.. వ్యక్తిగతంగానూ నాకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. చాలా కాలం నుంచి ఆయన నాకు ఆయనతో పరిచయం ఉంది.. సభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్ సింగ్: మాజీ రాష్ట్రపతి కోవింద్‌

  • 27 Dec 2024 11:40 AM (IST)

    మన్మోహన్‌ అద్భుతమైన ఆర్థికవేత్త: ఆర్బీఐ మాజీ గవర్నర్‌

    భారతదేశం ఎలా ఉండాలో, రాజకీయంగా ఏవి సాధ్యమవుతాయో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు చక్కటి అవగాహన ఉంది.. ప్రధాని పీవీ నరహింహారావు మద్దతులో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ ఆధునిక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు పునాదులయ్యాయి: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌

  • 27 Dec 2024 11:38 AM (IST)

    మన్మోహన్‌ పార్థివదేహానికి రాష్ట్రపతి ఘన నివాళి

    మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ పార్థివ దేహానికి ఘన నివాళులర్పించింది.. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

  • 27 Dec 2024 11:19 AM (IST)

    మన్మోహన్‌ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచించేవారు: రాబర్ట్ వాద్రా

    మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించే మాట్లాడేవారు.. ఆర్థిక విషయాలపై ఆయనకు చాలా పరిజ్ఞానం ఉంది.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను: రాబర్ట్ వాద్రా

  • 27 Dec 2024 11:16 AM (IST)

    ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్‌ సేవలు చిరస్మరణీయం: ఆర్ఎస్ఎస్

    మన్మోహన్‌ సింగ్ మృతితో దేశం మొత్తం విచారంలో ఉందని తెలిపిన ఆర్ఎస్ఎస్.. సాధారణ నేపథ్యం నుంచి అత్యున్నత పదవిని అధిరోహించారని వెల్లడి.. ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్‌ సేవలు చిరస్మరణీయం: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

  • 27 Dec 2024 11:14 AM (IST)

     

  • 27 Dec 2024 11:13 AM (IST)

    మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాయి: పొంగులేటి

    దేశం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం.. దేశాన్ని గ్లోబల్ మార్కెట్‌లోకి చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.. మన్మోహన్‌ సింగ్ ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాయి.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను: మంత్రి పొంగులేటి

  • 27 Dec 2024 11:07 AM (IST)

    నివాళులర్పించిన రాజ్‌నాథ్‌ సింగ్‌..

    మన్మోహన్‌ పార్థివదేహానికి నివాళులర్పించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌..

  • 27 Dec 2024 11:06 AM (IST)

    మన్మోహన్‌ సింగ్‌కు నివాళులర్పించిన రాహుల్, సోనియా

    మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ

  • 27 Dec 2024 10:10 AM (IST)

    రేపు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివదేహం..

    రేపు ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహం.. అలాగే, రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకం అవనతం..

  • 27 Dec 2024 10:09 AM (IST)

    మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు..

    రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. ఢిల్లీలోనే అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు..

  • 27 Dec 2024 10:07 AM (IST)

    నివాళులర్పించిన ప్రధాని మోడీ

    మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా,

  • 27 Dec 2024 10:05 AM (IST)

    చంద్రబాబుతో మన్మోహన్ సింగ్..

    2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ..

  • 27 Dec 2024 10:03 AM (IST)

    వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో మన్మోహన్ సింగ్..

    2006లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశం..

  • 27 Dec 2024 10:01 AM (IST)

    జిన్‌పింగ్‌తో మన్మోహన్ భేటీ

    2013లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ..

  • 27 Dec 2024 09:58 AM (IST)

    అబ్దుల్ కలాంతో మన్మోహన్ సింగ్..

    2005లో భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో సమావేశమైన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్..

  • 27 Dec 2024 09:57 AM (IST)

    ఎల్‌కే ఆద్వానీతో మన్మోహన్ సింగ్..

    బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే ఆద్వానీతో కలిసి నడిచిన మన్మోహన్ సింగ్

  • 27 Dec 2024 09:54 AM (IST)

    పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో మన్మోహన్

    2011లో పాకిస్తాన్‌ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..

  • 27 Dec 2024 09:52 AM (IST)

    జయలలితతో మన్మోహన్ సింగ్..

    తమిళనాడు మాజీ సీఎం జయలలితతో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌

  • 27 Dec 2024 09:51 AM (IST)

    పీవీ నరసింహారావుతో మన్మోహన్ సింగ్‌

    మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో మన్మోహన్ సింగ్‌

  • 27 Dec 2024 09:47 AM (IST)

    జార్జ్ డబ్ల్యూ బుష్ తో మన్మోహన్ సింగ్ కరచాలనం..

    2005లో న్యూ ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తో కరచాలనం చేసిన అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌..

  • 27 Dec 2024 09:43 AM (IST)

    ప్రధాని మోడీతో మన్మోహన్ సింగ్..

    2017 సెప్టెంబరు 30వ తేదీన న్యూ ఢిల్లీలో దశేరా సందర్భంగా ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశం..

  • 27 Dec 2024 09:41 AM (IST)

    బరాక్ ఒబామాతో మన్మోహన్ సింగ్..

    2010న నవంబరు 7వ తేదీన న్యూ ఢిల్లీలోని పాలమ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన భార్య మిచెల్‌ను కలిసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అతడి భార్య గురుశరణ్ కౌర్.

  • 27 Dec 2024 09:38 AM (IST)

    సోనియా గాంధీ, శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీతో మన్మోహన్ సింగ్


    సోనియా గాంధీ, శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీతో మన్మోహన్ సింగ్

  • 27 Dec 2024 09:34 AM (IST)

    మన్మోహన్‌ సింగ్ ఇంటికి రాహుల్, ఖర్గే

    మాజీ ప్రధాని మన్మోహన్‌ ఇంటికి వచ్చిన రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే