NTV Telugu Site icon

Delhi: పార్లమెంట్‌ను సందర్శించిన బిల్‌గేట్స్

Billgates

Billgates

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడ జేపీ నడ్డాతో బిల్‌గేట్స్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: SSMB29 : ఇదీ మహేశ్ రేంజ్.. ఇక ఏ గొడవ లేనట్టే?

ఇదిలా ఉంటే మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిల్‌గేట్స్ సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ సహకారం గురించి చర్చించనున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మూడేళ్లలో బిల్‌గేట్స్‌కి ఇది మూడో పర్యటన కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Telangana Budget 2025: మంత్రిత్వ శాఖల వారీగా ఏ శాఖకు ఎంత కేటాయించారంటే?