Tamil Nadu: మాజీ ఎంపీ మృతిలో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former DMK MP Masthan was murdered by cousin: మాజీ ఎంపీ, డీఎంకే లీడర్ ఎస్ మస్తాన్ మరణంలో మిస్టరీ వీడింది. ముందుగా గుండెపొటు అని అంతా భావించినప్పటికీ.. కుటుంబ సభ్యులు అనుమానించడంతో ఇది హత్య అని తేలింది. సొంత బంధువే మాజీ ఎంపీని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇది గుండెపోటు కాదని.. ఆర్థిక లావాదేవీల కారణంగానే మస్తాన్ బంధువు, మరికొందరు కలిసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు జ్యూడిషయల్ కస్టడీకి పంపించారు.
Read Also: Gujarat: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్‌కు గుండెపోటు..9 మంది దుర్మరణం
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఎంపీ మస్తాన్ తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో కీలక వ్యక్తి. గతంలో ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడు మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల మస్తాన్ తన సోదరుడి అల్లుడు ఇమ్రాన్ బాషాతో కలిసి కారులో చెంగల్పట్టు వెళ్లారు. ఈ సమయంలో మస్తాన్ కు గుండె నొప్పి వచ్చిందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లానని.. తిరిగి వస్తుండగా గుండెపోటుతో మరణించారని ఇమ్రాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అయితే కుటుంబ సభ్యులు మస్తాన్ మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి పోస్టుమార్టం నిర్వహించాలని మస్తాన్ కుమారుడు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. ఈ విషయంపై గుడువంచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదికలో మస్తాన్ ఊపరి ఆడకుండా చనిపోయాడని తేలింది. దీంతో పాటు నిందితుడు ఇమ్రాన్ కార్యకలాపాలపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కారులోనే మస్తాన్ పై దాడి చేసి, ఊపిరాడకుండా చంపేశారని పోలీస్ విచారణలో తేలింది. ఇమ్రాన్ బాషా తన అనుచరులతో కలిసి మస్తాన్ ను హతమర్చాడని అంగీకరించాడు. ఇమ్రాన్, మస్తాన్ నుంచి రూ.15 అప్పు తీసుకున్నాడు. మస్తాన్ ఈ డబ్బులను అడగడంతో ఇమ్రాన్ అతడిని హత్య చేశాడు. ఇమ్రాన్ తో పాటు సుల్తాన్, నషీర్, అహ్మద్, లోగేశ్వరన్ లను అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!