Site icon NTV Telugu

Tamil Nadu: మాజీ ఎంపీ మృతిలో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Tamil Nadu

Tamil Nadu

Former DMK MP Masthan was murdered by cousin: మాజీ ఎంపీ, డీఎంకే లీడర్ ఎస్ మస్తాన్ మరణంలో మిస్టరీ వీడింది. ముందుగా గుండెపొటు అని అంతా భావించినప్పటికీ.. కుటుంబ సభ్యులు అనుమానించడంతో ఇది హత్య అని తేలింది. సొంత బంధువే మాజీ ఎంపీని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇది గుండెపోటు కాదని.. ఆర్థిక లావాదేవీల కారణంగానే మస్తాన్ బంధువు, మరికొందరు కలిసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు జ్యూడిషయల్ కస్టడీకి పంపించారు.

Read Also: Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్‌కు గుండెపోటు..9 మంది దుర్మరణం

ఎంపీ మస్తాన్ తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో కీలక వ్యక్తి. గతంలో ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడు మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల మస్తాన్ తన సోదరుడి అల్లుడు ఇమ్రాన్ బాషాతో కలిసి కారులో చెంగల్పట్టు వెళ్లారు. ఈ సమయంలో మస్తాన్ కు గుండె నొప్పి వచ్చిందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లానని.. తిరిగి వస్తుండగా గుండెపోటుతో మరణించారని ఇమ్రాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే కుటుంబ సభ్యులు మస్తాన్ మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి పోస్టుమార్టం నిర్వహించాలని మస్తాన్ కుమారుడు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. ఈ విషయంపై గుడువంచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదికలో మస్తాన్ ఊపరి ఆడకుండా చనిపోయాడని తేలింది. దీంతో పాటు నిందితుడు ఇమ్రాన్ కార్యకలాపాలపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కారులోనే మస్తాన్ పై దాడి చేసి, ఊపిరాడకుండా చంపేశారని పోలీస్ విచారణలో తేలింది. ఇమ్రాన్ బాషా తన అనుచరులతో కలిసి మస్తాన్ ను హతమర్చాడని అంగీకరించాడు. ఇమ్రాన్, మస్తాన్ నుంచి రూ.15 అప్పు తీసుకున్నాడు. మస్తాన్ ఈ డబ్బులను అడగడంతో ఇమ్రాన్ అతడిని హత్య చేశాడు. ఇమ్రాన్ తో పాటు సుల్తాన్‌, నషీర్‌, అహ్మద్‌, లోగేశ్వరన్‌ లను అరెస్ట్ చేశారు పోలీసులు.

Exit mobile version