NTV Telugu Site icon

Kejriwal: రేపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్

Kejriwal

Kejriwal

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్లి.. అనంతరం ఆరు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఆ సీటులో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేజ్రీవాల్ వెంటనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఆయనకు సమయం దొరకడంతో శుక్రవారం నివాసాన్ని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Film Chamber: కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఫిలిం ఛాంబర్

ఇదిలా ఉంటే ఏ పార్టీకి అధినేతగా ఉన్న కేజ్రీవాల్‌కు అధికారిక నివాసాన్ని కేటాయించాలంటూ కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండాలని డిసైడ్ అయ్యారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహణకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Slow Eating: ఆహారాన్ని నమిలి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

కేజ్రీవాల్‌కు ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు వసతి కల్పించేందుకు ముందుకువచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. డిఫెన్స్ కాలనీ, పితంపురా, జోర్‌బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, హౌస్‌ ఖాస్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్‌కు వసతి కల్పిస్తామంటూ అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసే సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, కులతత్వం.. ప్రధాని మోడీ ఫైర్..