దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో సంక్షోభం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే ఉదాహరణ. గత ఐదు రోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునే నాథుడు లేక.. ఇంకోవైపు తిండి తిప్పలు లేక.. మరో వైపు చలి తీవ్రతతో నరకయాతన పడుతున్నారు. దేశీయ ప్రయాణికులతో పాటు విదేశీ ప్రయాణికులు కూడా తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఆఫ్రికన్ ప్రయాణికురాలికి కోపం కట్టలు తెచ్చుకుంది. విమాన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో సిబ్బందితో గొడవకు దిగింది. తాను వెళ్లాల్సిన విమానం ఎందుకు రద్దైందో చెప్పాలంటూ డిమాండ్ చేసింది. సరైన సమాధానం రాకపోవడంతో ఇండిగో కౌంటర్ ఎక్కి ఘర్షణకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది. ఆమె తీరు చూసిన సిబ్బంది చేతులెత్తేశారు. ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
इंडिगो का इश्यू नहीं है ये !
ये इश्यू है इस देश के निकम्मे लोगों का !
दिल्ली की निकम्मी सरकार का इश्यू है!
A stupid father is crying for sanitary Pad, public is paying 200 at airport for an item of 20 Rs but Delhi Government unable to facilitate them.
सो रही है दिल्ली की राज्य… pic.twitter.com/1QNIYRthdx— Pooja Tiwari (@PoojaSays_) December 5, 2025
Delhi airport scene hai .
The worst thing is the government is sleeping 😴 pic.twitter.com/8Yl7mWorJm
— Charu Yadav (@YadavCharu28) December 5, 2025
