Site icon NTV Telugu

Pahalgam Attack: పాతికేళ్ల క్రితం క్లింటన్.. ఇప్పుడు జేడీ వాన్స్: విదేశీ అతిథులు ఉన్నప్పుడే ఉగ్రదాడులు..!

Terror

Terror

Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేందుకే విదేశీ అతిథుల భారత పర్యటనలో ఉండగానే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో ఉండటం.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత్‌లో పర్యటన కొనసాగుతున్న సమయంలో పహల్గాం దాడి జరగడం గమనార్హం.

Read Also: Disha Patani : రెచ్చిపోయిన దిశా పటానీ.. ఆ ఫోజులు చూస్తే..

అయితే, ఇలాంటి ఘటన సుమారు పాతికేళ్ల క్రితం జరిగింది. అంటే, 20 మార్చి 2000వ సంవత్సరంలో అనంత్‌నాగ్‌ జిల్లాలో ఛత్తీసింగ్‌పొరలో ఉగ్రవాదులు సుమారు 36 మందిని చంపేశారు. నాడు సిక్కు కమ్యూనిటీలోని వారే ఉగ్రవాదులకు టార్గెట్ అయ్యారు. వాస్తవానికి అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూ ఢిల్లీ పర్యటనలో ఉండగా.. అప్పుడు జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాకిస్థాన్ ఈ దాడికి పాల్పడినట్లు అందరు భావించారు. కాగా, నాడు ఉగ్రమూకలు భారీ తుపాకులు, రెండు సైనిక వాహనాల్లో ఛత్తీసింగ్‌పొర గ్రామంలోకి చొరబడి.. ఇంటింటికీ తిరిగి తమను సైనిక సిబ్బందిగా చెప్పుకొని.. తనిఖీల నిమిత్తం పురుషులు అందరు బయటకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.. ఆ తర్వాత వారందరినీ గురుద్వారా దగ్గర ఉంచి కాల్చి చంపేశారు. దీంతో భారత సైన్యమే ఆ పని చేసిందన్నట్లు అక్కడిని వారిని ఈ ఉగ్రవాదులు నమ్మించేలా నినాదాలు కూడా చేశారు. కానీ, చివరికి దర్యాప్తు సంస్థలు పాక్‌ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు తేల్చాయి.

Read Also: Pahalgam Terror Attack: వెలుగులోకి ఉగ్రవాదుల దాడి దృశ్యాలు

కాగా, ఇప్పుడు.. పహల్గాంలో ఉగ్ర దాడికి.. గతంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుటుంబంతో కలిసి పర్యటిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఇదే సరైన సమయంగా భావించిన ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వెళ్లి పహల్గామ్‌కు వచ్చిన పర్యటకుల మతంతో పాటు ఐడీలను పరిశీలించి మరీ దాడి చేశారు. హిందువులనే టార్గెట్ గా చేసుకుని చంపేయడం గమనార్హం.

Exit mobile version