NTV Telugu Site icon

వ్యాక్సిన్ వేసుకో.. గోల్డ్ కాయిన్స్, బైక్‌, మొబైల్‌ ప‌ట్టుకుపో..!

vaccines

క‌రోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. అయితే, ఓవైపు వ్యాక్సిన్ల కొర‌త కొన్ని రాష్ట్రాల‌ను వేధిస్తున్నా.. మ‌రోవైపు.. ఇప్ప‌టికీ వ్యాక్సిన్ అంటే అవ‌గాహ‌న‌లేక భ‌య‌ప‌డిపోయేవారు కూడా ఉన్నారు.. దీంతో.. కొన్ని సంస్థ‌లు వినూత్న రీతిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పూనుకుంటున్నాయి.. వ్యాక్సిన్ వేసుకొండి.. ఈ గిఫ్ట్‌లు గెలుచుకోండి అంటూ ప్ర‌చారం చేస్తున్నాయి.. ఇక‌, తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లా కోవలంలో ఎస్ టీఎస్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యాక్సిన్ పై వినూత్న అవగాహన కార్య‌క్ర‌మం చేప‌ట్టింది.. రిజిస్టేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న‌వారికి బిర్యానీ, మ‌గ‌వారికి సెల్‌ఫోన్ రీచార్జ్, ఆడ‌వారికి చీర‌లు పంపిణీ చేస్తున్నారు.. రోజుకు వంద‌మందికి చొప్పున ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.. కరోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తిస్థాయిలో అయిన త‌ర్వాత ల‌క్కీ డ్రా ద్వారా గ్రామ‌స్తుల‌కు బైక్‌, ఫ్రిజ్‌, వాషింగ్ మిష‌న్‌, మొబైల్ ఫోన్లు, 10 మందికి గోల్డ్ కాయిన్స్‌, చీర‌లు పంపిణీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌.. కరోనా వ్యాక్సిన్‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకే అక్క‌డి యువ‌త ఈ వినూత్న ఆలోచ‌న చేసింది.