NTV Telugu Site icon

Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికలు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ఆప్

Delhi Mayor Election

Delhi Mayor Election

For Delhi Mayor Polls AAP Goes To Supreme Court: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 6వ తేదీన జరగాల్సిన ఈ ఎన్నికలు.. కార్పొరేటర్ల రసాభాసతో వాయదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా ఓ ఊహించని షాక్ ఇచ్చింది. ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడిందని, ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ(బీజేపీ) సరైన స్పష్టత ఇవ్వడం లేదని, నిర్ణీత సమయంలోపు ఎన్నిక నిర్వహించేలా ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను ఆదేశించాలని కోరుతూ.. ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేసిన పది మంది కౌన్సిలర్లకు ఓటింగ్‌ అర్హత లేదని, వాళ్లను ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలువరించాలని కూడా ఆ పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Bridegroom : పెళ్లి పనులు చేస్తూనే.. వరుడు అనంతలోకాలకు

కాగా.. డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 250 వార్డుల్లో ఆప్‌ 134 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 104 సీట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో.. షెల్లీ ఒబెరాయ్‌ మేయర్‌గా, మరో ఆప్ అభ్యర్థి డిప్యూటీ మేయర్ కావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఎన్నికల బరిలోకి దిగింది. దాంతో.. ఈనెల 6వ తేదీన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. కార్పొరేటర్ల రసాభాసతో ఎన్నిక వాయిదా పడింది. 24వ తేదీన ఎన్నిక నిర్వహించాలని యత్నించగా.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ దెబ్బకు ఎన్నికలు మళ్లీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి, ఊహించని పరిణామానికి తెరలేపింది.

Google: భార్యాభర్తలకు షాకిచ్చిన గూగుల్.. ఒకేసారి ఇద్దరికి లేఆఫ్