Lalu Prasad Yadav: ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ.. సింగపూర్ కు తరలించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, లాలూ ప్రసాద్ యాదవ్ ను మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ లోని ఎయిమ్స్ కు తరలించారు. లాలూ.. ఆరోగ్య సమస్యలతో పాటు భుజం విరగడంతో బాధ పడుతున్న లాలూను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. అయితే.. లాలూ ప్రసాద్ ఆదివారం తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో ఆయన కుడి భుజం ఎముక విరిగింది. కాగా.. కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేర్చించారు. అయితే..లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్టు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు.
కాగా.. ఇప్పటికే తీవ్రమైన కిడ్నీ వ్యాధితో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రసాద్‌ని ఎయిమ్స్‌లో చేర్చామన్నారు. అయితే..ఇక్కడి వైద్యులు గతంలో ఆయనకు చికిత్స చేశారన్నారు. అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామన్నారు. లాలూ పెద్దకుమర్తె మిసా భారతి లాలూతోనే ఉన్నారు. అయితే లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఈనేపథ్యంలో.. లాలూ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపిన ఆయన పట్నాలోని పరాస్ ఆసుపత్రికి వెళ్లి లాలూను పరామర్శించి, లాలూ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
Also Read
- Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
- Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
- DK.Shivakumar: రేపే సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం.. కేబినెట్లో వీరికి బెర్త్ కన్ఫాం!
- India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
తాజావార్తలు
-
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Anirudh Reddy : తెలంగాణలో పోటీకి సిద్ధమా.? అనిరుధ్ రెడ్డి రాజకీయ సవాల్
-
US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
-
YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
-
Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!