Food Poisoning: కేరళలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 100 మందికి ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేరళలో పతినంతిట్ట జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాప్టిజం వేడుకలకు హాజరైన 100 మంది వ్యక్తులు గతవారం డిసెంబర్ 29న ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఫుడ్ సప్లై చేసిన క్యాటరింగ్ సర్వీస్ కంపెనీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Read Also: Ukraine War: కీవ్‌పై విరుచుకుపడిన రష్యా.. మిసైళ్లు, డ్రోన్లతో అటాక్..
పతినంతిట్ట జిల్లా కీజ్ వాయిపూర్ గ్రామంలో ఇటీవల బాప్టిజం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామంలోని ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆహారం తీసుకున్న తర్వాత 100 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరిని ఆ ప్రాంతంలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్చారు. ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు క్యాటరింగ్ సర్వీస్ కంపెనీపై ఐపీసీ 268, 272, 269 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
