NTV Telugu Site icon

Delhi: పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ.. 2025-26 బడ్జెట్‌పై చర్చ

Fm

Fm

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక తాజాగా గురువారం వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో నిర్మలా సీతారామన్ సమావేశం అయ్యారు. 2025-26 బడ్జెట్‌‌పై ఇండస్ట్రీస్ ప్రముఖులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: CRIME: గర్భం దాల్చడం లేదని భర్త బెదిరింపులు.. గొడ్డలితో నరికి చంపిన భార్య..

ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదో సారి నిరలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎగుమతి, వాణిజ్యం, పరిశ్రమల రంగాలకు చెందిన వాటాదారులు మరియు నిపుణులతో సంప్రదింపులు జరిపారు.

ప్రధాని మోడీ ఇటీవల ఆర్థికవేత్తలుతో సమావేశం అయ్యారు. ఉద్యోగ కల్పన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను పరిష్కరించడంపై చర్చలు జరిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్తలైన అశోక్ గులాటీ, డికె జోషి, సూర్జిత్ భల్లా, జనమేజయ సిన్హా, సౌమ్య కాంతి ఘోష్, అమిత బాత్రా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

 

Show comments