NTV Telugu Site icon

Bihar: గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఇళ్లు.. వీడియోలు వైరల్

Biharfloods

Biharfloods

బీహార్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. గంగా తీరం వెంబడి ఉన్న దాదాపు 12 జిల్లాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో 13.5 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 376 గ్రామ పంచాయతీలు ప్రభావితమయ్యాయి. చాలా మంది నివాసితులు శిబిరాలకు తరలించారు. ఇదిలా ఉంటే భాగల్‌పూర్ జిల్లాలో గంగా నది ఉధృతికి సమీపంలో ఉన్న ఇళ్లు కొట్టకుపోయాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పలు ఇళ్లు నదిలో కొట్టుకుపోయాయి. ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Bandi Sanjay: పవన్ కళ్యాణ్‌కు బండి సంజయ్ మద్ధతు..

గంగా నది ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. పలు రైళ్లు రద్దయ్యాయి. పలు యూనివర్సిటీల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వర్షాలు కారణంగా ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.

ఇది కూడా చదవండి: R Krishnaiah Resigns: వైసీపీకి బిగ్ షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా

మమల్కా గ్రామంలో కనీసం 10 ఇళ్లు నదిలోకి జారుకున్నాయి. రెండు, మూడు అంతస్తుల నిర్మాణాలు కూడా కొట్టుకుపోయాయి. కొన్ని సెకన్లలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పాట్నా, భాగల్‌పూర్, బక్సర్, భోజ్‌పూర్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, కతిహార్, ఖగారియా, ముంగేర్ ప్రభావితమైన 12 జిల్లాలు ఉన్నాయి. బీహార్ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రత్యయ అమృత్ సోమవారం 12 జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని అంచనా వేశారు. నీరు మరింత పెరిగితే పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఇది కూడా చదవండి: Supreme Court: ఎన్నారై కోటా ముసుగులో మోసానికి యత్నం!