Bihar: గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఇళ్లు.. వీడియోలు వైరల్
- బీహార్‌లో గంగా నది ఉగ్రరూపం
- కొట్టుకుపోయిన రెండంతస్తుల ఇళ్లు.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. గంగా తీరం వెంబడి ఉన్న దాదాపు 12 జిల్లాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో 13.5 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 376 గ్రామ పంచాయతీలు ప్రభావితమయ్యాయి. చాలా మంది నివాసితులు శిబిరాలకు తరలించారు. ఇదిలా ఉంటే భాగల్‌పూర్ జిల్లాలో గంగా నది ఉధృతికి సమీపంలో ఉన్న ఇళ్లు కొట్టకుపోయాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పలు ఇళ్లు నదిలో కొట్టుకుపోయాయి. ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: పవన్ కళ్యాణ్‌కు బండి సంజయ్ మద్ధతు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
గంగా నది ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. పలు రైళ్లు రద్దయ్యాయి. పలు యూనివర్సిటీల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వర్షాలు కారణంగా ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.
ఇది కూడా చదవండి: R Krishnaiah Resigns: వైసీపీకి బిగ్ షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
మమల్కా గ్రామంలో కనీసం 10 ఇళ్లు నదిలోకి జారుకున్నాయి. రెండు, మూడు అంతస్తుల నిర్మాణాలు కూడా కొట్టుకుపోయాయి. కొన్ని సెకన్లలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పాట్నా, భాగల్‌పూర్, బక్సర్, భోజ్‌పూర్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, కతిహార్, ఖగారియా, ముంగేర్ ప్రభావితమైన 12 జిల్లాలు ఉన్నాయి. బీహార్ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రత్యయ అమృత్ సోమవారం 12 జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని అంచనా వేశారు. నీరు మరింత పెరిగితే పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఎన్నారై కోటా ముసుగులో మోసానికి యత్నం!
#WATCH : These Videos from Bhagalpur, district of Bihar.. where a terrible flood was seen not in the Ganga, but in just 10 minutes many houses got washed away in the Ganga, thousands of families became homeless.#bhagalpur #BiharNews #Flood #flooding #Ganga pic.twitter.com/tNkBNbv1WL
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 24, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!