NTV Telugu Site icon

Khalistan: బరితెగించిన ఖలిస్తాన్ వేర్పాటువాదులు.. ఇందిరాగాంధీ హత్యను ప్రతిబింబిచేలా పరేడ్..

Khalistan

Khalistan

Khalistan: ఖలిస్తానీ వేర్పాటువాద శక్తులు రోజురోజుకు బలపడుతున్నాయి. విదేశాలు వేదికగా భారతదేశంపై విషం చిమ్ముతున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియాల్లో భారత విద్వేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఖలిస్తాన్ రిఫరెండ పేరిట నానా హంగామా సృష్టిస్తున్నారు. గతంలో అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వెతుకుతున్న సమయంలో ఏకంగా లండన్ లోని భారత రాయబార కార్యాయలంపై దాడి చేసి ఖలిస్తాన్ జెండాను ఎగరేసే ప్రయత్నం చేశారు. ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు.

Read Also: Deve Gowda: దేశంలో బీజేపీ సంబంధం లేని పార్టీని చూపించండి.. మాజీ ప్రధాని సంచలన కామెంట్స్..

ఇదిలా ఉంటే మరోసారి ఖలిస్తాన్ మూకలు బరి తెగించాయి. జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ లో జరిగి ఖలిస్తాన్ పెరెడ్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్యను ప్రతిబించేలా ఓ శకటాన్ని రూపొందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బ్రాంప్టన్ లోని ఖలిస్తానీ మద్దతుదారులు 5 కిలోమీటర్ల పొడవైన కవాతులో ఈ 1984న సిక్కు అంగరక్షకులు కాల్పులు జరిపి ఇందిరాగాంధీని హత్య చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిని ఈ వీడియో చాలా మంది నెటిజన్లు ఖండించారు.

ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టినందుకు ఇందిరాగాంధీని హత్య చేశారు. సిక్కులకు పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్న జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నేతృత్వంలోని వందలాది మంది సిక్కు మిలిటెంట్లను నిర్మూలించాలనే లక్ష్యంతో సైన్యం జూన్ 3 మరియు 6, 1984 మధ్య గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌ను ముట్టడించి ఆపరేషన్ చేసింది. ఆ తరువాత అక్టోబర్ 31, 1984న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులే కాల్పులు జరిపి హత్య చేశారు.