NTV Telugu Site icon

Air india Express: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అయోధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India Express

Air India Express

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. బాంబు బెదిరింపుతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం అక్టోబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్లుగా గుర్తించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్‌ని వెంటాడుతోందా..?

విమానం జైపూర్ నుంచి బయల్దేరినట్లుగా తెలిపారు. అలాగే సేఫ్‌గా ల్యాండ్ అయినట్లుగా ధృవీకరించారు. బాంబు బెదిరింపు రాగానే బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేసినట్లుగా తెలిపారు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం- అయోధ్య ధామ్ దగ్గర వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడ్డాయి. అనేక విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది.

ఇది కూడా చదవండి: iVoomi: ఫెస్టివల్ స్పెషల్.. ఈ ఈవీ పై భారీ తగ్గింపు.. ..!

సోమవారం కూడా ముంబై నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానాన్ని న్యూఢిల్లీకి మళ్లించారు. సోమవారం ఉదయం నగరం నుంచి మరో రెండు ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారి తెలిపారు. విమానం 6E 56 ముంబై నుంచి జెద్దాకు నడుస్తుండగా.. మరొకటి – 6E 1275 మస్కట్‌కు వెళ్తుండగా ఈ బెదిరింపులు వచ్చినట్లుగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్‌ని వెంటాడుతోందా..?

Show comments