Smoking Beedi On Flight: విమానంలో బీడీ తాగుతూ పట్టుబడిన ప్రయాణికుడు

Akasa Air

Akasa Air

Smoking Beedi On Flight: విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్న వ్యక్తి, నిబంధనలు తెలియక బీడీ తాగాడు. దీంతో అరెస్ట్ అయ్యాడు. అహ్మదాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ మార్వార్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి మంగళవారం అహ్మదాబాద్‌లో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగా.. మరుగుదొడ్డికి వెళ్లిన అతను అక్కడ బీడీ తాగాడు.

Read Also: Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు

×
×
Ad

దీన్ని గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుంది. బెంగళూర్ లోని కెంపెగౌడ విమానాశ్రయంలో విమానం దిగగానే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని బెంగళూర్ సెంట్రల్ జైలుకు పంపారు. విమానంలో ఇ-సిగరేట్, స్మోకింగ్ నిషేధం. అయితే తాను నిత్యం రైలులో ప్రయాణిస్తుంటానని, టాయిలెట్ లో పొగతాగుతానని, విమానంలో కూడా ఇలాగే చెయొచ్చని భావించానని, నిబంధనలు తెలియవని నిందితుడు పోలీసులకు వెల్లడించారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టివేసిన కారణంగా ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా విమానంలో సిగరేట్ కాల్చినందుకు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.