NTV Telugu Site icon

First multiplex in Jammu Kashmir: శ్రీనగర్‌లో తొలి మల్టీప్లెక్స్ ప్రారంభం.. మూడు దశాబ్ధాల తరువాత ఇప్పుడే..

Inox In Jammu Kashmir

Inox In Jammu Kashmir

First multiplex in Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొత్త చరిత్ర మొదలైంది. మూడు దశాబ్దాల కాశ్మీరీ ప్రజల కల నెరవేరింది. గతంలో నిత్యం ఉగ్రవాద దాడులు, కాల్పులతో అట్టుడుకుతూ ఉండే కాశ్మీర్ లో ప్రజలు ఇప్పుడిప్పుడే వినోదానికి దగ్గర అవుతున్నారు. కాశ్మీర్ జిల్లాల్లో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆదివారం పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో మల్లిపర్సస్ థియేటర్లను ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా. దీన్ని చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో కాశ్మీర్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో థియేటర్లు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.

Read Also: Bengaluru: నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్‌ని హత్య చేసిన ప్రియురాలు

తాజాగా జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే తొలిసారిగా మల్టీప్లెక్స్ ప్రారంభం అయింది. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం శ్రీనగర్ పట్టణంలో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ ఐనాక్స్ మల్టీప్లెక్స్ పూర్తి కావడానికి మొత్తం 5 ఏళ్ల సమయం పట్టింది. తొలి సినిమాగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాను ప్రదర్శించారు. మొత్తం 520 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ థియేటర్ ప్రారంభం అయింది.

1990 నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదం ఎక్కువ కావడంతో.. థియేటర్లు నడుపుతున్న యజమానులకు బెదిరింపులు ఎదురయ్యేవి. దీంతో కాశ్మీర్ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. 1999లో శ్రీనగర్ లోని రీగల్ థియేటర్ ప్రారంభించాలని చూశారు. అయితే థియేటర్ ప్రారంభం తొలిరోజే ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మరణించగా.. 12 మంది వరకు గాయపడ్డారు. అప్పటి నుంచి థియేటర్ల పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తర్వాత నుంచి నెమ్మదిగా కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెడుతుండటంతో కాశ్మీర్ లోయ వ్యాప్తంగా శాంతి నెలకొంది.