Site icon NTV Telugu

Delhi: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. బయటపడ్డ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు.. షాకైన అధికారులు

Delhifire

Delhifire

చట్టం తెలిసివాళ్లే.. చట్టాన్ని మీరితే ఇంకేమీ న్యాయం జరుగుతుంది. ఉన్నతమైన స్థానంలో కూర్చుని తీర్పులు చెప్పే న్యాయమూర్తులే గాడి తప్పుతున్నారు. న్యాయశాఖకే మచ్చ తెచ్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో వర్మ ఇంట్లో లేరు. దీంతో కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. తనిఖీ చేసి ఆ డబ్బంతా లెక్కల్లో చూపించని బ్లాక్ మనీగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: BRS vs Congress: తెలంగాణ శాసన మండలిలో గందరగోళం.. మంత్రి జూపల్లి vs బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

ఈ సమాచారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు చేరింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఖన్నా.. వెంటనే కొల్లీజియం సమావేశం ఏర్పాటు చేసి.. వర్మను అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పరిణామంతో న్యాయశాఖ ఇమేజ్ దెబ్బతిన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అగ్నిప్రమాదం జరగకపోతే.. ఈ బండారం బయటపడకపోయేది. ‘‘చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు’’ అన్నట్టుగా వర్మ తీరు అయిపోయింది. ఇలాంటి వాళ్లు న్యాయాన్ని ఏం రక్షిస్తారంటూ నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి.

ఇది కూడా చదవండి: IPL 2025 Predictions: మాజీ క్రికెటర్ల ప్లేఆఫ్స్ ప్రిడక్షన్స్.. సన్‌రైజర్స్‌కు ఏకంగా 8 మంది మద్దతు!

Exit mobile version