NTV Telugu Site icon

Bhopal Fire Accident: భోపాల్‌లోని సాత్పురా భవన్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident

Fire Accident

Bhopal Fire Accident: భోపాల్‌లోని సాత్పూరా భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో అనేక ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక ఆఫీసులున్నాయి. అగ్ని ప్రమాదంతో చెలరేగిన మంటలను ఆర్పేయడానికి అధికారులు సుమారు 14 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఎయిర్‌ఫోర్స్ మరియు స్థానిక అధికారులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.

Read also: Tamannaah Bhatia: అవును, ఆ సంబంధం ఉంది.. రూమర్స్‌పై తమన్నా క్లారిటీ

సాత్పూరా భవన్ లోని 3వ ఫ్లోర్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు మంటలు చెలరేగాయి. 3వ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు వేగంగా పైనున్న అన్ని అంతస్థులకు వ్యాపించాయి. మంటలు వ్యాపిస్తున్న క్రమంలో ఎయిర్‌ కండీషనర్లు, గ్యాస్‌ సిలిండర్లు పేలిపోవడంతో మంటల తీవ్రత బాగా పెరిగిపోయిందని అధికారులు ప్రకటించారు. సాత్పూరా భవనంలో మంటలు చెలరేగిన గిరిజన సంక్షేమ శాఖలోని ఫైళ్లతోపాటు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన పలు ఫైళ్లు మరియు ఇతర శాఖలకు చెందిన ఫైళ్లు సైతం దగ్ధమయ్యాయని అధికారులు ప్రకటించారు.

Read also: Health Tips: రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం వీటిని తప్పక తీసుకోవాలి..

భారత వైమానిక శాఖ మరియు స్థానిక అధికారులతో దాదాపు 14 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత భోపాల్‌లోని సాత్పురా భవన్‌లో మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. భారత వైమానిక దళానికి చెందిన విమానం AN-52 మరియు MI-15 ఛాపర్ రాత్రిపూట డౌసింగ్ ఆపరేషన్‌లో చేరి పై నుండి బకెట్లను ఉపయోగించి నీటిని పోశాయి. ప్రమాద సమయంలో సకాలంలో భవనంలోని అధికారులు, సిబ్బందిని ఖాళీ చేయించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికి ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి, హోంమంత్రి అమిత్ షాలకు సమాచారం అందించారని.. మంటలను ఆర్పేందుకు కేంద్ర సహాయాన్ని కోరినట్టు రాష్ట్రానికి చెందిన ఒక అధికారి తెలిపారు.

Show comments