Site icon NTV Telugu

AIIMS Fire Accident: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం..

Aiims

Aiims

AIIMS Fire Accident: ఢిల్లీలో ఉన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్) లో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిమ్స్‌ బిల్డింగ్‌లోని ఎండోస్కోపీ రూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే హాస్పిటల్‌ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఎండోస్కోపి రూమ్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది అక్కడ ఉన్న రోగులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. రోగులతోపాటు సిబ్బంది కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు.

Read also: Nenu Super Woman: ”ఆహా” అనిపిస్తున్న ”నేను సూపర్ ఉమన్”..3 వారాల్లో 3 కోట్ల 90 లక్షల పెట్టుబడులు

ఎయిమ్స్ లో పాత ఓపీడీ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ రూమ్‌లో మంటలు చెలరేగడంతోతో దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా పొగ బయటికి రావడంతో ఏం జరుగుతోందో సిబ్బంది, రోగులకు తెలియని పరిస్థితి నెలకొంది. పేషంట్లు వారితోపాటు ఉన్న అటెండెంట్లు మరియు ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం సమయంలోనే పేషంట్లను అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. తాత్కాలికంగా ఎమర్జెన్సీ వార్డును మూసివేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగిన ఎండోస్కోపీ రూమ్ కింది అంతస్తులోనే ఎమర్జెన్సీ వార్డు ఉండటంతో అక్కడ ఉన్న పేషంట్లు, సిబ్బందితోపాటు డాక్టర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు రాగానే ఫైర్ అలారమ్ మోగడంతో సిబ్బంది అప్రమత్తమ్యయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి జరిగిన విషయం చెప్పడంతో వారు రంగంలోకి దిగారు. ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 6 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు వెల్లడించారు. సకాలంలో స్పందించి ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగడంతో మంటలు ఇతర వార్డులకు వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నట్లు వివరించారు.

Read also: Ola Electric: కుక్కకి కొలువిచ్చిన ఓలా ఎలక్ట్రిక్.. ఐడీ కార్డు కూడా భలే ఉందిగా..

మంటలను ఆర్పేందుకు మొదట 4 అగ్నిమాపక వాహనాలు వచ్చినప్పటికీ.. మంటలు తీవ్రంగా పెరగడంతో మరో 2 వాహనాలను తీసుకొచ్చారు. మొత్తంగా సుమారు 6 వాహనాలతో ఎయిమ్స్ లోని మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఇతర వార్డులు, అంతస్లుల్లోకి వ్యాపించకుండా నియంత్రించినట్టు అగ్నిమాపక అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలు తెలియనప్పటికీ.. ఎండోస్కోపీ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని హాస్పిటల్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version