NTV Telugu Site icon

UP: “డ్రమ్ మర్డర్” భయం.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త.. ఈ కథలో మరో ట్విస్ట్..

Up

Up

UP: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్త తన భార్యను ఆమె లవర్‌ ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వార్తాంశంగా మారింది. భర్తది గొప్ప హృదయం అంటూ అంతా కొనియాడారు. అసలు విషయం ఏంటంటే, ఇటీవల మీరట్‌లో జరిగిన డ్రమ్ మర్డర్ భయంతో, తనను కూడా ఎక్కడ భార్య, ఆమె లవర్ కలిసి చంపేస్తారనే అనుమానంతో పెళ్లి చేసినట్లు ఒప్పుకున్నాడు మీరట్‌లో ఇటీవల సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని, భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి హత్యచేసి శరీరాన్ని నరికి, డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పేయడం సంచలనంగా మారింది. ఇదే కాకుండా యూపీ ఔరయ్యాలో భర్తను చంపేందుకు భార్య, తన లవర్‌తో కలిసి సుపారీ ఇచ్చింది. ఈ రెండు సంఘటనల భయంతోనే భర్త దగ్గరుండి పెళ్లి చేయించాడు.

దీని భయంతోనే ఇద్దరికి భర్త పెళ్లి చేశాడు. భార్య, ఆమె లవర్ పెళ్లికి పెద్దగా భర్త మారాడు. రిజిస్ట్రేషన్‌కి సాక్షిగా నిలిచాడు. అయితే, ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు ఆమె కొత్త భర్త తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటెయ్యడంతో మళ్లీ భర్త చెంతకే చేరింది. ఆమెను పెద్ద మనసుతో మరోసారి భర్త అంగీకరించడం ఇక్కడ హైలెట్.

Read Also: Waqf Bill: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. రేపు పార్లమెంట్‌లో “వక్ఫ్ బిల్లు”..

యూపీ సంత్ కబీర్ నగర్‌లోని కతార్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూకి, గోరఖ్‌పూర్‌కి చెందిన రాధికతో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూలీ పనుల కోసం వేరే ప్రాంతాల్లో ఉండే బబ్లూకి, రాధికకు అదే గ్రామంలో ఉండే వికాస్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. అయితే, రాధికతో వాదించడం వల్ల ఉపయోగం ఉండదని గ్రహించిన బబ్లూ.. ఆమెను, వికాస్‌కి వివాహం జరిపించాడు. పిల్లలను తానే చూసుకుంటానని చెప్పాడు.

అయితే, నాకు ప్రాణహాని జరగకుండా ఉండటానికి వివాహం చేయించాలనని బబ్లూ చెప్పాడు. మీరట్ ఘటనలో ఏం జరిగిందో అందరం చూశామని, అందుకే నా భార్యకు ఆమె ప్రేమికుడితో వివాహం జరిపించానని చెప్పాడు. అయితే, గోరఖ్‌పూర్‌లోని వికాస్ ఇంటికి వెళ్లిన రెండు రోజులకు , రాధికను ఆమె అత్తగారు తిరిగి బబ్లూ వద్దకు పంపారు. తల్లి లేకుండా చిన్న పిల్లల్ని పెంచడం అమెకు ఇష్టం లేదు. ‘‘వికాస్ నా కొడుకు, రాధికను బబ్లూ, ఆమె ఇద్దరు పిల్లల వద్దకు వెళ్లాలని కోరాను. ఇద్దరు పిల్లల పట్ల నాకు బాధగా ఉంది’’ అని వికాస్ తల్లి చెప్పింది.