NTV Telugu Site icon

Arvind Kejriwal: ఇండియా కూటమి భయంతోనే “భారత్” .. తర్వాత భారత్ పేరును బీజేపీగా మారుస్తుందా..?

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇండియా పేరును ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’ని మారుస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలమిస్తూ.. జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా మారడం చర్చకు దారి తీసింది.

ఇదిలా ఇండియా పేరు భారత్ గా మారుస్తారనే రూమర్స్ నడుమ ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలకు దిగారు. ప్రతిపక్ష ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. ఇండియా అని పేరు పెట్టడం వల్ల బీజేపీ ఓట్లు తగ్గుతాయని భయపడుతోందని అందుకే ఇలాంటి వ్యూహాలను అవలంభిస్తోందని ఆయన అన్నారు. బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం ఒక్క పార్టీదే కాదని 140 కోట్ల మంది ప్రజలదని, రేపు ఇండియా కూటమి భారత్ గా పేరు మార్చుకుంటే, భారత్ పేరు మారుస్తుందా..భారత్ పేరును బీజేపీ అని పెడుతుందా..? అని ప్రశ్నించారు.

Read Also: KL Rahul: కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలంటే.. అయ్యర్‌ను పక్కన పెట్టాల్సిందే!

పేరు మార్పును జోక్ గా అభివర్ణించారు. ఇండియా పేరును భారత్ గా మార్చడం వల్ల విపక్ష కూటమికి కొన్ని ఓట్లు తగ్గవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ పార్టీలు కూడా ఈ పేరు మార్పు వివాదంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ, ఇండియా కూటమికి భయపడుతోందని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగంలో భారత్ అనే పదం ఉందని, ఇండియాను భారత్ గా మార్చాల్సిన అవసరం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ.. అన్ని మతాలను గౌరవించుకోవాలని, ఏ మతం గురించి తప్పుగా మాట్లాడటం సరికాదని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఉదయనిధి పేరును మాత్రం ప్రస్తావించలేదు. నేను కూడా సనాతన మతానికి చెందిన వాడినే అని.. ఒకరి విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడటం తప్పని అన్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ గురించి మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీ ఈ అంశంపై చర్చ ప్రారంభించిందని ఎద్దేవా చేశారు.

Show comments