Pune Car Accident Case: పూణేలో మైనర్ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమయ్యాడు. పోర్ష్ కారుతో బైకును ఢీకొట్టడంతో 24 ఏళ్ల అనీష్ అవధియా, 21 ఏళ్ల అశ్విని కోష్ట మృతి చెందారు. శనివారం వీరిద్దరు గెట్ టూ గెదర్ పార్టీకి హాజరై తిరిగి వస్తున్న సమయంలో తెల్లవారుజామున 2.15 నిమిషాలకు వేగంగా వచ్చిన కారు వీరి బైకుని ఢీకొట్టింది. ఇద్దరు కూడా అక్కడికక్కడే మరణించారు.
Read Also: Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళి..
ఈ కేసులో 17 ఏళ్ల మైనర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇతనికి 15 గంటల్లోనే పూణే కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెయిల్ మంజూరు చేస్తూ.. ప్రమాదంపై 300 పదాలతో వ్యాసం రాయాలని, ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పనిచేయడంతో పాటు మద్యపాన అలవాటు కోసం కౌన్సిలింగ్, చికిత్స తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. నిందితుడైన మైనర్ తాగి గంటకు 240 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని బలిగొన్నాడు.
ఈ కేసులో మైనర్ తండ్రి పరారీలో ఉన్న విశాల్ అగర్వాల్‌ని ఔరంగాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేడ్ డెవలపర్ అయిన ఇతను యాక్సిడెంట్ తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు పూణే పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
