NTV Telugu Site icon

Jharkhand: లవర్‌తో మాట్లాడుతుందని కూతురు హత్య.. అత్యాచారంగా చిత్రీకరించే ప్రయత్నం

Jharkhand

Jharkhand

father kills daughter: తన కూతురు రాత్రి వేళల్లో లవర్ తో మాట్లాడుతోందని ఓ తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దీనికి కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైసాబాలో చోటు చేసుకుంది. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు కూతురు లవర్ ను నిందితుడిగా చిత్రీకరించేందుకు తండ్రితో పాటు అతని ఇద్దరు కొడుకులు విశ్వప్రయత్నం చేశారు.

Read Also: Sonu Nigam: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై ఎమ్మెల్యే కుమారుడు దాడి

వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 9 రాత్రి, తన 20 ఏళ్ల కూతురు సాదియా కౌషర్ వీడియో కాల్ లో తన లవర్ తో మాట్లాడుతుందని భావించిన తండ్రి మహ్మద్ ముస్తాఫా అహ్మద్ తీవ్రంగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన సాదియా, మరణించిందని భావించి ముస్తాఫా అహ్మద్ తన ఇద్దరు కొడుకులు షేక్ మొహమ్మద్ బకాష్, మొహమ్మద్ షాద్ సాయంతో సాదియా శరీరానికి ఇటుకలు కట్టి ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడేశారు. ఇంతటి ఆగకుండా తన కూతురు కనిపించడం లేదని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన కూతురుతో ఓ యువకుడితో మాట్లాడుతోందని.. అతనే అత్యాచారం చేసి, తన కూతును చంపేసినట్లు ముస్తాఫా పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. తన కూతురు విషయంలో ఎవరికి అనుమానం రాకుండా పోలీసులపై ఒత్తడి పెంచుతూ, తన కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు చేయడంతో, ముందుగా పోలీసులు సదరు యువకుడే నిందితుడని భావించారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13న సాదియా శరీరాన్ని ఇంటికి సమీపంలోని ఓ బావిలో కనుగొన్నారు. డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు శాస్త్రీయ పరిశోధన చేశారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించారు. హత్య అనంతరం తండ్రి కొడుకులు తమకు ఏం తెలియనట్లు దుకాణానికి వెళ్లి పనిచేసేవారు. గతంలో కూడా సాదియా కౌషన్ తన స్నేహితులతో మాట్లాడొద్దని తండ్రి హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో కోపంతో హత్య చేసినట్లు ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు.

Show comments