NTV Telugu Site icon

Karnataka: పసుపు చేనులో గంజాయి సాగు.. తండ్రీ, కొడుకు అరెస్ట్

Untitled 5

Untitled 5

Karnataka: బిడ్డ బలహీనంగా ఉన్నాడు పండ్లు పెట్టమని వైద్యుడు చెప్తే బలానికి రేగిపళ్ళుపెట్టిందని.. ఏదైనా పంటేగా అనుకున్నారేమో గాని ఓ తండ్రీ కొడుకులు గంజాయి పంట పండించారు. పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసీ ఈ అక్రమానికి పాల్పడ్డారు. పసుపు పంటను సాగు చేస్తున్నట్లు అందరిని నమ్మించారు. అయితే నిజం నిప్పులాంటిదని.. గుప్పెట్లో దాగదు అన్నట్లు సమాచారం పోలీసులకు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం లోని హనూర్‌ తాలూకా ఆనెగుండి గ్రామం లో ఎస్ బాలు (65), మహాలింగ (35) అనే తండ్రీ కొడుకులు నివసిస్తున్నారు.

Read also:Delhi Airport: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. విమానాల దారి మళ్లీంపు

కాగా వారికి ఉన్న పొలంలో పసు పంటను సాగు చేస్తున్నారు. అయితే ఆ పసుపు చేను పేరుకు మాత్రమే పసుపు చేను. పసుపు ముసుగులో మాధకద్రవ్యాల పరిధి లోకి వచ్చే గంజాయి పంటను అక్రమంగా సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ పొలం లోపల చూడగా పసుపు పంట మధ్యలో గంజాయి పంటను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీనితో పోలీసులు ఆ తండ్రీ కొడుకులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. కాగా పసుపు పంట మధ్యలో అక్రమంగా పెంచిన సుమారు 2 లక్షల విలువైన 95 గంజాయి మొక్కలను (34 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.