Bihar: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలితో సహా ముగ్గురు హత్య

  • బీహార్‌లో ప్రేమోన్మాది ఘాతుకం
  • ప్రియురాలితో సహా ముగ్గురు హత్య
Biharlovemurder

Biharlovemurder

బీహార్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని, ఆమె సోదరిని, తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని, అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘోరం సరన్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Puja Khedkar: ప్రభుత్వం సీరియస్ యాక్షన్.. పూజా అక్రమ కట్టడాలు కూల్చివేత

×
×
Ad

సరన్ జిల్లా ధన్‌దిహ గ్రామంలో మంగళవారం రాత్రి జబర్ సింగ్‌ ఇంటికి వచ్చిన ఒక యువకుడు కత్తితో అతడి ఇద్దరు కుమార్తెలను పొడిచి చంపాడు. అడ్డొచ్చిన జబర్ సింగ్, అతని భార్యకు కూడా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో జబర్ సింగ్ ప్రాణాలు కోల్పోగా.. భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని, అతడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. భయాందోళనకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Rambha Daughter: హీరోయిన్లను మించేలా రంభ కూతురు.. స్టార్ హీరోతో ఫొటోలు చూశారా ?

ఇక ప్రేమ వ్యవహారంతోనే హత్య జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఛప్రాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. గంటల వ్యవధిలోనే నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Venkaiah Naidu: రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..ఎందుకంటే..