Farooq Abdullah: కాల్పులపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా.. ఏమన్నారంటే..!
- హత్యాయత్నంపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా
- అమిత్ షా ఫోన్ చేసి పరామర్శించారని వెల్లడి
- జమ్మూకాశ్మీర్‌లో ఓ వివాహ వేడుకలో కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లో హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (88) తొలిసారి మీడియాతో స్పందించారు. అల్లా దయ వల్ల తాను ప్రమాదం నుంచి బయటపడినట్లుగా చెప్పారు.
జమ్మూలో జరిగిన ఒక వివాహంలో తనపై జరిగిన కాల్పులను తొలుత బాణాసంచా అనుకుని పొరపడినట్లు పేర్కొ్న్నారు. శబ్దం రాగానే సెక్యూరిటీ సిబ్బంది కారు ఎక్కించేశారని.. అనంతరం తుపాకీ పట్టుకున్న వ్యక్తి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని చెప్పారన్నారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. దేవుడే తన ప్రాణాలను రక్షించాడని చెప్పారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం గురించి లేదా అది భద్రతా లోపమా? కాదా అనే దాని గురించి తాను ఊహించలేనన్నారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఇతర అధికారులు వేగంగా పనిచేశారని.. తనను రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
కాల్పుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి తన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని.. విచారణ జరగాలని అమిత్ షా అన్నారని తెలిపారు. అయినా ఏ మతమూ ద్వేషాన్ని బోధించదని.. ప్రేమను మాత్రమే నేర్పుతుందని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరితో కలిసి అబ్దుల్లా ఒక వివాహ కార్యక్రమం నుంచి బయటకు వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇక నిందితుడు జమ్మూలోని పురాని మండి నివాసి అయిన 63 ఏళ్ల కమల్ సింగ్ జామ్వాల్గా గుర్తించారు. గత 20 సంవత్సరాలుగా అబ్దుల్లాను లక్ష్యంగా చేసుకున్నానని.. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని పోలీసులకు చెప్పాడు. ‘‘అది నా వ్యక్తిగత ఎజెండా. ఆ ఆయుధం నా సొంతం. నాకు జారీ చేయబడింది.’’ అని తెలిపాడు. సంఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. ఎన్టీఏ పాలనలో భద్రత లేదంటూ కాంగ్రెస్ అగ్ర నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు.
#WATCH | Jammu, J&K: An incident of firing occurred at a function where JKNC chief Farooq Abdullah and Deputy CM Surinder Choudhary were present. One person has been arrested. No injuries have been reported.
CCTV visuals showing the moment when the incident took place. pic.twitter.com/pnoD3f9fRJ
— ANI (@ANI) March 11, 2026
#WATCH | Over an assassination attempt on him, Farooq Abdullah says, "The Central and the UT govt should see if the situation here is really improved. We might have differences of opinion, but we have to work together as we are a democracy and voice our opinions….An elected… pic.twitter.com/zLGFD5mrpU
— ANI (@ANI) March 12, 2026
#WATCH | Jammu | National Conference President Farooq Abdullah says, "No matter how much security you increase, the killer always has an advantage. The problem is that we live in an era where terrorism is up in the sky, and we cannot control it…" pic.twitter.com/aiJKTIDUad
— ANI (@ANI) March 12, 2026
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!