India-Bangladesh Border: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యం పాకిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. మరోవైపు ఆ దేశంలోని మైనారిటీలు, ప్రధానం హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇక బంగ్లా మాజీ ఆర్మీ అధికారులు భారత్‌కి వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు.
Read Also: Rahul Gandhi: “కులగణన”తో బీహార్ ప్రజలను మోసం చేశాడు.. నితీష్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ
దీనికి తోడు ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల సరిహద్దు ప్రాంతంలో మన దేశంలో బీఎస్ఎఫ్ కంచె నిర్మిస్తుంటే, దీనికి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అభ్యంతరం చెప్పింది. ఇది వివాదానికి కారణమైంది. తాజాగా, సరిహద్దుల్లో ఇరు దేశాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన సుఖ్‌దేవ్ పూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ సమీపంలో జరిగింది.
అంతర్జాతీయ సరిహద్దు వద్ద పనిచేసుకుంటున్న భారత రైతులు, బంగ్లాదేశ్ రైతులు తమ పంటను దొంగిలించారని ఆరోపించారు. దీంతో ఇరు దేశాల సైనికులు సరిహద్దు వద్దకు చేరుకుని ఘర్షణ పడ్డారు. రెండు వైపుల భారీ సంఖ్యలో జనాలు గుమిగూడారు. తిట్టుకుంటూనే, రాళ్లదాడులకు పాల్పడ్డారు. సకాలంలో BSF మరియు BGB సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భారత రైతులు ప్రశాంతంగా ఉండాలని, సరిహద్దు వివాదాల్లో పాల్గొనవద్దని అభ్యర్థించినట్లు బీఎస్ఎఫ్ చెప్పింది. ఏదైనా ఫిర్యాదులు ఉంటే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.