Site icon NTV Telugu

Mumbai: ముంబైలో నకిలీ శాస్త్రవేత్త అరెస్ట్.. అణు డేటా ఉన్నట్లుగా అనుమానాలు!

Mumbai2

Mumbai2

ముంబైలో నకిలీ అణు శాస్త్రవేత్త అలెగ్జాండర్ పామర్ అలియాస్ అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేనిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం వెర్సోవాలో అరెస్ట్ చేశారు. వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా చెలామణి అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతడి దగ్గర అణు డేటా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Trump-Jinping: ట్రంప్-జిన్‌‌పింగ్ భేటీ వేళ చైనాకు ఊరట.. సుంకాలు తగ్గింపు

దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగమైన భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC)లో నకిలీ శాస్త్రవేత్తగా ఉన్నట్లు గుర్తించారు. ఇతడి దగ్గర అణు డేటా, డజన్ల కొద్దీ మ్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. పత్రాల్లో ఏదైనా సున్నితమైన, గోప్యమైన అణు సమాచారం ఉందో.. లేదో తెలుసుకునేందుకు పరిశీలిస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Bhopal: భోపాల్‌లో కిలాడీ డీఎస్పీ.. స్నేహితురాలి ఇంటికొచ్చి ఏం చేసిందంటే..!

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విచారణలో అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని (60) నుంచి కీలక సమాచారం రాబట్టారు. జార్ఖండ్‌కు చెందిన మునాజిల్ ఖాన్ అనే కన్సల్టెన్సీ దగ్గర నుంచి ఆధార్, పాన్, ఇతర పత్రాలను పొందినట్లుగా కనుగొన్నారు. 2016లో కేవలం రూ.19,000లకే ఈ గుర్తింపులు పొందినట్లుగా తెలుస్తోంది. దీంతో అక్తర్ పూర్తిగా కొత్త వ్యక్తిగా చెలామణి అవుతున్నట్లుగా గుర్తించారు. మొత్తానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వల పన్ని మునాజిల్ ఖాన్‌ను అక్టోబర్ 25న అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Bengaluru: అమానుషం.. రోడ్డుపై చిన్న ప్రమాదానికే యువకుడి ప్రాణం తీసిన దంపతులు

గత కొన్ని నెలలుగా అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని అనేక అంతర్జాతీయ కాల్స్ చేశాడని వర్గాలు సూచించాయి. కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. అనుమానిత అణు డేటాను విదేశీ నెట్‌వర్క్‌లతో పంచుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్తర్ మారు వేషంలో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా కనిపెట్టారు. 2004లో రహస్య పత్రాలతో శాస్త్రవేత్త అని చెప్పుకున్న ఇతడ్ని దుబాయ్ నుంచి బహిష్కరించారు. బహిష్కరణ తర్వాత కూడా నకిలీ పాస్‌పోర్ట్‌లు ఉపయోగించి పలుమార్లు దుబాయ్, టెహ్రాన్, ఇతర ప్రదేశాలకు ప్రయాణం చేసినట్లు గుర్తించారు.

జార్ఖండ్ నివాసి అయిన మునాజిల్ ఖాన్.. అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని సోదరుడి కోసం రెండు పాస్‌పోర్ట్‌లను నకిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పాస్‌పోర్ట్‌ల్లో చూపించిన చిరునామా జంషెడ్‌పూర్‌లోని ఒక ఇంటికి చెందినది. ఇది అక్తర్ తండ్రి మరణం తర్వాత దాదాపు 30 సంవత్సరాల క్రితం విక్రయించారు. ఈ పాస్‌పోర్ట్‌లు హుస్సేని మొహమ్మద్ ఆదిల్, నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుస్సేని పేర్లపై ఉన్నాయి. అక్తర్, అతని సోదరుడు ఆదిల్ ఇద్దరూ విదేశాలకు వెళ్లడానికి నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. అక్తర్ సోదరుడు ఆదిల్ హుస్సేనీని ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనే మునాజిల్ ఖాన్‌కు అక్తర్‌ను పరిచయం చేసినట్లు సమాచారం. ఇక పోలీసులను తప్పుదారి పట్టించడానికి.. అక్తర్ హుస్సేని విచారణ సమయంలో తన సోదరుడు చనిపోయి చాలా కాలం అయిందని అబద్ధం చెప్పాడు.

ఇక దర్యాప్తులో ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మునాజిల్ ఖాన్ సోదరుడు ఇలియాస్ ఖాన్ కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం అతన్ని వాంటెడ్‌గా ప్రకటించారు. ఇలియాస్ ఖాన్.. అక్తర్ హుస్సేనిన్‌కు పాఠశాల, కళాశాల డిగ్రీలతో సహా నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను అందించాడని ఆరోపణలు ఉన్నాయి.

Exit mobile version