Site icon NTV Telugu

Swati Maliwal Row: అవినీతి కేసులో ఇరుక్కుంది, బీజేపీ ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తోంది.. ఆప్ సంచలన ఆరోపణ..

Swatimaliwal Issue

Swatimaliwal Issue

Swati Maliwal Row: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి అంశం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఇరకాటంలో పెట్టింది. ఈ వ్యవహారంలో దాడికి పాల్పడినట్లు ఆరోపించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ నివేదిక ప్రకారం, ఆమె కాలు, చెంపపై గాయాలు ఉన్నట్లు తేలింది. సోమవారం సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆమెపై దాడి జరిగిందని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీ, ఆప్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడమే కాకుండా, సీఎం కేజ్రీవాల్ ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే, ఆప్ మాత్రం ఇది బీజేపీ కుట్రగా ఆరోపిస్తోంది. ఆమెపై దాడి జరగనే లేదని నిన్న ఆప్ మంత్రి అతిషీ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఈ కుట్రలో భాగం అయ్యేలా స్వాలి మలివాల్‌ని బీజేపీ బ్లాక్‌మెయిల్ చేసిందని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా బీజేపీ ఆమెను ఉపయోగించుకుంటోందని మరోసారి ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ శనివారం ఆరోపించారు. బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదేని, ఢిల్లీ పోలీసుల్ని బీజేపీ సాధనంగా వాడుకుంటోందని అన్నారు. దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ని బీజేపీ టార్గెట్ చేస్తుందని దుయ్యబట్టారు.

Read Also: Appointment of SPs: మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం.. ఈ మేరకు ఈసీ ఆదేశాలు

స్వాతి మలివాల్‌పై అక్రమ రిక్రూట్మెంట్ కేసు ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంలోనే బీజేపీ ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, అందుకే ఈ కుట్రలో భాగమైందని అతిషీ అన్నారు. అయితే, స్వాతి మలివాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎడిట్ చేసిన వీడియోలను ఆప్ ప్రసారం చేస్తోందని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. అపాయింట్‌మెంట్ లేకుండా సోమవారం ముఖ్యమంత్రి నివాసానికి ఆమె ఎందుకు వెళ్లారని అతిషీ ప్రశ్నించారు.

అపాయింట్‌మెంట్ లేకుండా ఆమె ఎందుకు సీఎం నివాసంలోకి దూసుకెళ్లింది. ఆ రోజు కేజ్రీవాల్ బీజీగా ఉన్నారు. ఆమెను కలవలేదు. అతను ఆ రోజు కలిసి ఉంటే బిభవ్ కుమార్‌పై ఆరోపణలు వచ్చిన విధంగానే ఆయనపై కూడా వచ్చి ఉండేవని అతిషీ చెప్పారు. బిభవ్ కుమార్, స్వాతి మలివాల్‌ చెంపపై కొట్టడం, పొట్టలో తన్నడం వంటివి ఆరోపణలు అబద్ధమని అతిషీ చెప్పింది. ఈ కుట్రంలో స్వాతి మలివాల్ కాల్ రికార్డుల్ని పరిశీలించి, ఆమె ఏ బీజేపీ నేతతో టచ్‌లో ఉందో వెల్లడించాలని ఢిల్లీ పోలీసుల్ని డిమాండ్ చేసింది.

Exit mobile version