Site icon NTV Telugu

AIADMK-BJP: అన్నాడీఎంకే-బీజేపీ పొత్తును స్వాగతించిన బహిష్కృత నేత పన్నీర్ సెల్వం..

Aiadmk Bjp

Aiadmk Bjp

AIADMK-BJP: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళని స్వామి, కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలు కూడా గంటల తరబడి చర్చించారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-అన్నాడీఎంకేల పొత్తు తెర పైకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార డీఎంకేని ఓడించేందుకు ఎవరితో ఐనా కలిసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై చెప్పడం, దీనికి తోడు పళని స్వామి కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం చూస్తే పొత్తు దాదాపుగా ఉంటుందనే తెలుస్తోంది.

Read Also: KTR : ఆయనకు ఫ్రస్టేషన్‌ తగ్గట్లేదు.. నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా.. కేటీఆర్‌ సంచలనం

ఇదిలా ఉంటే, అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరుతో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ సీఎం, పన్నీర్ సెల్వం కూడా ఈ పొత్తును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగమని, బీజేపీ అన్నాడీఎంకేల మధ్య చర్చల్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అన్నాడీఎంకేకు నాయకత్వంపై మాట్లాడుతూ.. కాలం నిర్ణయిస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే, పొత్తు నేపథ్యంలో అన్నాడీఎంకే బీజేపీ కేంద్ర అధిష్టానం ముందు కీలక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై పాత్ర తగ్గించాలని పళనిస్వామి అమిత్ షాకు చెప్పినట్లు తెుస్తోంది. పొత్తు విషయంలో టీటీవీ దినకరన్, వీకే శశికళ, పన్నీర్ సెల్వం గురించ తను ఎలాంటి ఆందోళన లేదని పళని స్వామి చెప్పినట్లు వెల్లడించారు.

Exit mobile version