Site icon NTV Telugu

Ramachandru Tejavath: కేసీఆర్ నా సలహాలను పట్టించుకోలేదు.. అందుకే రాజీనామా చేశా..

Ramachandru Tejawath

Ramachandru Tejawath

Ramachandru Tejavath: రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాధించిందని తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, రిటైర్డు ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ అన్నారు. రాజనీతిజ్ఞుడిగా భావించే కేసీఆర్ ఆదివాసి అభ్యర్థిత్వంపై ఆలోచించాల్సిందని చెప్పారు. ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాలని కేసీఆర్‌కు సూచించానని.. కానీ, పార్టీ అధ్యక్షుడిగా ఆయన తన సలహాలను పట్టించుకోలేదన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఏ పార్టీ లో చేరాలన్న అంశంపై ఇంకా ఆలోచన చేయలేదన్నారు. భవిష్యత్ ఈ అంశంపై ఆలోచిస్తానని తెలిపారు.

దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రజలు, దేశవ్యాప్తంగా ఆదివాసీల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చాలా చేశానని.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అనేక ప్రాజెక్ట్‌లకు అనుమతులు తీసుకువచ్చానని ఆయన వెల్లడించారు. తొలిసారి ఆదివాసి గవర్నర్‌గా ముర్ము సేవలందించారని.. అలాగే తొలి ఆదివాసీ, మహిళా రాష్ట్రపతిగా దేశానికి సేవలందించబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు అవకాశం దక్కకపోతే ఆదివాసీ రాష్ట్రపతి కలగానే మిగిలేదన్నారు.

Telangana Weather Update: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న త‌రుణంలో టీఆర్ఎస్ పార్టీలో కీల‌క నేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా కొన‌సాగుతున్న రామ‌చంద్రు తేజావత్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం రాజీనామా లేఖను టీఆర్ఎస్ అధిష్ఠానాకి పంపడంతో పాటు మీడియాకు కూడా విడుదల చేశారు. తన రాజీనామాకు గల కారణాన్ని లేఖలో వివరించారు.

Exit mobile version