Site icon NTV Telugu

Tamil Nadu: దక్షిణాదికొస్తే కంగనా రనౌత్‌ను చెప్పుతో కొట్టిండి.. దుమారం రేపుతోన్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

Kangana Ranaut

Kangana Ranaut

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నాయకుడు కేఎస్.అళగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ దక్షిణాదికి వస్తే చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

రూ.100 చెల్లిస్తే మహిళా కార్యకర్తలను నిరసనల్లో పాల్గొనేందుకు నియమించుకోవచ్చని కంగనా రనౌత్ గతంలో చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు అళగిరి స్పందిస్తూ.. ఆమెపై మండిపడ్డారు. కంగనా అహంకారంతో మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ఆమె గనుక దక్షిణాది రాష్ట్రాలను సందర్శిస్తే.. ఆ సమయంలో ఆమెను చెంపదెబ్బ కొట్టాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఓట్లు తొలగిస్తున్నారు

కంగనా చాలా సార్లు ఇలాంటి విచ్చలవిడి మాటలే మాట్లాడిందని గుర్తుచేశారు. ఒకసారి ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక మహిళా సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. ఆమెను చెంపదెబ్బ కొట్టిందని జ్ఞాపకం చేశారు. రైతుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకే చెంపదెబ్బ కొట్టిందని తెలిపారు. అవమానించేలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుందన్నారు. ఈసారి మాత్రం దక్షిణాదికి వస్తే మాత్రం.. మరిచి పోకుండా ఆమెను చెంపదెబ్బ కొట్టాల్సిందే పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Obama: చార్లీ కిర్క్ హత్యపై ఒబామా కీలక వ్యాఖ్యలు

అయితే ప్రస్తుతం అళగిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కంగనాపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కంగనా చాలా అహంకారంతో మాట్లాడుతుందని సమర్థించుకున్నారు.

Exit mobile version