Odisha: ఒడిశాలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ హెడ్ మాస్టర్ కు జైలు శిక్ష విధించింది కోర్టు. 2015లో 11 మంది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సదరు హెడ్ మాస్టర్. ఆయనకు సుందర్‌గఢ్ జిల్లాలోని పోక్సో కోర్టు బుధవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 62 ఏళ్ల వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా లెఫ్రిపారా బ్లాక్ లోని ఓ పాఠశాలలో పనిచేసేవారు. ఆ సమయంలో స్కూల్ లోని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Read Also: Donald Trump: అమెరికాకు వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఏకం అవుతున్నాయి.. అణుయుద్ధం జరగొచ్చు..
కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్న విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు వెలుగులోకి రావడంతో జూన్ 14, 2016లో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్నారు. తాజాగా పోక్సో కోర్టు జడ్జ్ మహేంద్ర కుమార్ సూత్తధర్ బుధవారం నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష విధించారు. కోర్టు అతడికి జైలు శిక్షతో పాటు రూ. 47,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందిగా తీర్పు చెప్పింది.