NTV Telugu Site icon

Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరేకు అస్వస్థత.. రిలయన్స్ ఆస్పత్రికి తరలింపు

Uddhavthackeray

Uddhavthackeray

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఉద్ధవ్ థాకరే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయను యాంజియోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఉద్ధవ్ థాకరే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గుండె ధమనుల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వైద్యులు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో చేరికపై మరిన్ని వార్తలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Lawrence Bishnoi Gang: 700 మంది షూటర్లు.. 11 రాష్ట్రాల్లో నెట్‌వర్క్.. మరో దావూద్ ఇబ్రహీం!

ఇదిలా ఉంటే ఈ వారమే మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ థాకరే ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇది కూడా చదవండి: Bactrian Camel: సైన్యానికి ‘బాక్ట్రియన్’ ఒంటెలు.. విశిష్టత ఏమిటంటే?