NTV Telugu Site icon

Puja khedhkar: ముందస్తు బెయిల్ కోసం పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో పిటిషన్

Iaspujakhedkar

Iaspujakhedkar

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా.. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై యూపీఎస్సీ యాక్షన్ తీసుకుంది. ఆమె శిక్షణను నిలిపివేసింది. అలాగే రిపోర్టు చేయాలని ఆదేశించింది. కానీ ఆమె మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రిపోర్టు చేయలేదు. ఇక తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించినందుకు ఆమెపై ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైంది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

ఇది కూడా చదవండి: Rafale Jets: రాకెట్‌ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

యూపీఎస్సీ పరీక్షల్లో పూజా ఆల్ ఇండియా ర్యాంక్ 821 సాధించింది. అనంతరం పూణెలో ప్రొబేషనరీ ఐఏఎస్‌గా కొనసాగుతోంది. ట్రైనింగ్ సమయంలో ఎలాంటి అధికారులు ఉండవు. కానీ ఖేద్కర్ మాత్రం అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. పూణె కలెక్టర్.. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీంతో పూజాను వాషిమ్‌కు బదిలీ చేశారు. అనంతరం తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమె ట్రైనింగ్‌ను యూపీఎస్సీ నిలిపివేసింది. అలాగే షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ఆమెపై ఆరోపణలు రుజువైతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: Ravinder Chandrasekar: సినీ నిర్మాత ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆకస్మిక దాడులు